ఇక సినిమాలకు సెలవంటున్న ఫైట్ మాస్టర్లు…

fight-masters-ram-lakshman-said good bye to films
Share Icons:

హైదరాబాద్, 11 సెప్టెంబర్:

తెలుగు సినిమాలతో ఫైట్ మాస్టర్లుగా ప్రయాణం మొదలు పెట్టి తమిళ, మలయాళ, హిందీ చిత్రాలకు సైతం ఫైట్ మాస్టర్స్‌గా పని చేసిన రామ్, లక్ష్మణ్‌లు ఇక మీదట సినిమాలకు సెలవు ప్రకటించనున్నారట.

దాదాపు 1100 చిత్రాలకు పైనే పని చేసిన ఈ అన్నదమ్ములిద్దరూ ఇకపై సినిమాలు చెయ్యమని స్వయంగా ప్రకటించారు. తెలుగు హీరోలందరికీ వీరివురూ ఫైట్ మాస్టర్స్‌గా పని చేసిన విషయం తెలిసిందే..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, విక్రమార్కుడు, గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 సినిమాలు మంచి గుర్తింపు తెచ్చాయని అన్నారు.

సినిమా ఇండస్ట్రీలో తమకు ఇంతటి గుర్తింపు రావడానికి కారణం దర్శకుడు పూరి జగన్నాథ్ అనే విషయాన్ని వెల్లడిస్తూ.. త్వరలోనే తాము సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలిపారు.

సినిమాలకు దూరమై పల్లెటూరి వాతావరణంలో పచ్చటి ప్రకృతి నడుమ ఇంటిని నిర్మించుకొని ప్రశాంత జీవితం గడపాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం రామ్, లక్ష్మణ్ మహేష్ బాబు చిత్రంలోనూ, చిరంజీవి సైరా చిత్రంలోనూ పని చేస్తున్నారు. ఆ రెండు చిత్రాలు పూర్తి కాగానే సినిమాలకు పూర్తిగా సెలవు ప్రకటించనున్నారు.

మామాట: వారు లేని లోటు భర్తీ అవ్వడం కష్టమే…

Leave a Reply