ఫైనల్లో ఫ్రాన్స్

ఫైనల్లో  ఫ్రాన్స్
Views:
7

రష్యా,జూలై 11, ఫిఫా ప్రపంచకప్‌ లో  సంచలన విజయాలతో సెమీస్‌కు దూసుకొచ్చిన బెల్జియం ఆశలకు గండి పడింది.  ఫ్రాన్స్‌  ప్రపంచకప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. బెల్జియంతో మంగళవారం అర్ధరాత్రి జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బెల్జియంను 1-0 తేడాతో మట్టికరిపించింది. దీంతో ఫ్రాన్స్ రెండోసారి ప్రపంచ కప్‌ని ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో బెల్జియం జట్టు హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది కానీ నిలబడలేకపోయింది.

అటాకింగ్ గేమ్ :

గత 24 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో బెల్జియానికి ఓటమే లేదు. మరోవైపు ఫ్రాన్స్‌ కూడా ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శనని కొనసాగిస్తుండటంతో.. మ్యాచ్‌ ఉత్కంఠగా సాగింది. ఫ్రాన్స్ స్టార్ ఎంబాపే తొలి మూడు నిమిషాలు బంతిని ఆధీనంలో ఉంచుకుని బెల్జియం డిఫెండర్లకు చుక్కలు చూపెట్టాడు. వెంటనే బంతిని అందిపుచ్చుకున్న బెల్జియం ఆ తర్వాత అటాకింగ్ గేమ్ మొదలుపెట్టింది.

దాడి చేసిన ఫ్రాన్స్ :

తొలి 10 నిమిషాల్లోనే ఫ్రాన్స్ కొట్టిన రెండు షాట్లు వైడ్‌గా వెళ్లడంతో బెల్జియం ఊపిరి పీల్చుకుంది. 58 శాతం బంతిని ఆధీనంలో ఉంచుకున్న బెల్జియం 91 శాతం కచ్చితమైన పాస్‌లతో అలరించింది. మూడుసార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడి చేసి విఫలమైంది. ఫ్రాన్స్ 42 శాతానికి పరిమితమైనా బెల్జియం గోల్‌పోస్ట్‌పై 11 సార్లు దాడి చేసింది.

ఆఖరి వరకూ  :

బ్యాక్‌లైన్‌లో ఈడెన్ హజార్డీ కొట్టిన లో షాట్ వైడ్‌గా వెళ్లింది. ఆ తర్వాత అల్టెర్‌వీరెల్డ్ (బెల్జియం) కొట్టిన బలమైన ఫ్రీకిక్‌ను ఫ్రాన్స్ గోలీ హ్యూగో లోరిస్ కొనవేళ్లతో సమర్థంగా నిలువరించాడు. డిఫెన్స్, ఎటాకింగ్‌‌తో రెండు జట్లూ నువ్వా-నేనా అన్నట్లు పోరాడటంతో.. మ్యాచ్‌లో 50వ నిమిషం వరకూ కనీసం ఒక గోల్‌ కూడా నమోదవలేదు. కానీ.. 51వ నిమిషంలో శామ్యూల్ ఉమ్మటి హెడర్‌ గోల్‌తో ఫ్రాన్స్‌కి 1-0తో ఆధిక్యం అందించాడు. దీంతో.. ఒత్తిడికి గురైన బెల్జియం ఆఖరి వరకూ ఆధిక్యాన్ని సమం చేసేందుకు ప్రయత్నించినా.. ఆ జట్టుకి నిరాశే ఎదురైంది.

1998లో   ఫాన్స్:

చివర్లో బెల్జియం గోల్‌ కోసం విపరీతంగా ప్రయత్నించినా ఫ్రాన్స్‌ చాకచక్యంగా అడ్డుకుంది. బెల్జియం ఇప్పటి వరకు కనీసం ఒకసారి కూడా ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌కి చేరలేదు. ఇంగ్లాండ్‌, క్రొయేషియా తలపడే సెమీస్‌లో గెలిచిన జట్టుతో ఆదివారం మాస్కోలోని లుహినికి స్టేడియంలో ఫ్రాన్స్‌ ఫైనల్‌ ఆడనుంది. 1998లో తొలిసారి ఫిఫా వరల్డ్‌కప్‌ను గెలిచిన ఫాన్స్.. ఆ తర్వాత 2006లో ఫైనల్‌ చేరినా.. అక్కడ ఇటలీ చేతిలో అనూహ్యంగా ఓడిపోయి కొద్దిలో కప్‌ను చేజార్చుకుంది.

 

మామాట: ఇక ఆట మంచి రసవత్తరంగా సాగనుంది… బలమైనవాడిదే బంతి

(Visited 8 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: