పరువు కోసం కూతురితో పాటు ఎస్సైని కాల్చిచంపిన తండ్రి

పరువు కోసం కూతురితో పాటు ఎస్సైని కాల్చిచంపిన తండ్రి
Views:
13

హర్యానా, 10 ఆగష్టు:

పరువు కోసం ఎంతో గారభంగా పెంచుకున్న కూతురినే కాల్చి చంపాడు ఓ కసాయి తండ్రి……ఇక ఆ అమ్మాయిని కాపాడటానికి ప్రయత్నించిన ఓ ఎస్సైని కూడా దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే… రాష్ట్రంలోని రోహ్‌తక్‌ పట్టణంలో నివాసముండే రమేష్ దంపతులకు పిల్లలు లేకపోవడంతో తమకి తెలిసిన బందువుల అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆ అమ్మాయికి మమత అని పేరుపెట్టి చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు.

ఈ క్రమంలోనే మమత అదే ప్రాంతానికి చెందిన సోంబీర్ అనే దళిత యువకున్ని ప్రేమించి, పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు.

అయితే మమత ఇంకా మైనర్ కావడంతో తండ్రి రమేష్….తన కూతురిని సోంబేర్ కిడ్నాప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సోంబీర్‌ను అదుపులోకి తీసుకుని… ఈరోజు రోహ్‌తక్ కోర్టులో హాజరుపర్చారు.

అయితే ఇక్కడికి వచ్చిన కూతురుని చూడగానే ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన తండ్రి నిన్ను మరికొద్దిసేపట్లో చంపేస్తానని బెదిరించాడు. అతడు అలా అన్న కొద్దిసేపటికే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి కోర్టు ఆవరణలోనే మమతను తుపాకీతో కాల్చి చంపారు. ఇక ఆమెను కాపాడటానికి ప్రయత్నించిన స్థానిక ఎస్సైపై కూడా కాల్పులు జరపడంతో అతడు కూడా మృతిచెందాడు.

దీంతో రమేష్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని…బైక్ మీద వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కోసం గాలిస్తున్నారు.

మామాట: ఈ పరువు హత్యలు ఆగేదెప్పుడో?

(Visited 13 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: