బిడ్డకు ప్రేమతో… నాన్న ఇచ్చిన గిఫ్ట్ అదరహోఁ…!!

Share Icons:
  • కొడుకు కోసం కేవలం 65 రోజుల్లో కారు తయారు చేసిన తండ్రి
  • కలపతో తయారైన  హైబ్రిడ్‌ లంబోర్గిని సూపర్‌ స్పోర్ట్స్‌ కార్‌
  • ఈ బుల్లికారు గంటకు 25 కి.మీ వేగంతో నడుస్తుంది
  • సోసషల్ మీడియాలో చక్కర్లు కొడ్తున్న విడియో

ఐదేళ్ల కొడుకు అడిగాడని  వెంటనే పని మొదలుపెట్టి  ఆ బాలుడి కోసం కలపతో తయారైన  హైబ్రిడ్‌ లంబోర్గిని సూపర్‌ స్పోర్ట్స్‌ ఎలక్ట్రానిక్ కారును గిఫ్టుగా ఇచ్చాడు తండ్రి. దాన్ని అతను కోట్లు పోసి షోరూంలో కొనలేదు, 65 రోజులు శ్రమించి కొడుక్కి తగ్గట్టుగా వుడెన్‌ కారుతు తయారు చేసి తన తండ్రి  ప్రేమను చాటుకున్నాడు.

వియత్నాంకి చెందిన ట్రూంగ్‌ వాన్‌ డోవ్‌ కార్పెంటర్‌ పనిలో దిట్ట. అదే అతనకి అదే జీవనాధారం. కార్పెంటర్‌ పనితో పాటు సాంకేతిక అంశాలపైనా అతనికి మంచి పట్టుంది. దీంతో వడ్రంగి పనికి సాంకేతిక జోడించి కొత్తకొత్త డిజైన్లు చేస్తుండేవాడు. ఒకరోజు టీవీలో లంబోర్గిని కారును చూసి, అది కావాలని అడిగాడు అతని కొడుకు.

అంతే, కుమారుడు అడగటమే ఆలస్యం రంగంలోకి దిగిపోయాడు ట్రూంగ్‌ వాన్‌ డోవ్‌. వెంటనే కారు తయారీకి అవసరమైన వస్తువులు తెచ్చేశాడు. మొదటగా కారు బేస్‌ను సిద్ధం చేశారు. ఆ తర్వాత చక్రాలు తిరిగేందుకు అనువుగా కారు బాడీని రెడీ చేశాడు. ఆ తర్వాత అచ్చం లంబోర్గిని సియాన్‌ రోస్టర్‌ తరహాలో ముందు, వెనుక భాగంలో డిజైన్‌ సిద్ధం చేశాడు. కారు కదిలేందుకు వీలుగా బ్యాటరీ ఆపరేటెడ్‌ మోటార్లు అమర్చాడు. దీంతో ఈ బుల్లి లంబోర్గిని కారు గంటలకు 25 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదని ట్రూంగ్‌ చెబుతున్నాడు.
కారు తయారీకి సంబంధించిన వీడియోతో పాటు కారులో ట్రూంగ్‌ అతని కొడుకు వియత్నాం విధుల్లో చక్కర్లు కొట్టిన వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశాడు ట్రూంగ్‌. కొడుకుపై అతని ప్రేమకు, కొడుకు ముచ్చట తీర్చేందుకు అతడు పడ్డ శ్రమకు ఫిదా అవుతున్నారు నెటిజన్లు . ఆ విడియోను  మీరూ చూడండి మరి-

సేకరణ :- మామాట డస్క్ (అంతర్జాలం నుండి)

 

Leave a Reply