కోహ్లీ లేకపోయిన భారత్ గొప్ప జట్టే….

fakhar zaman said about virat kohli
Share Icons:

కరాచీ, 6 సెప్టెంబర్:

ఈ నెల 15 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్‌ టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే విరామం లేకుండా క్రికెట్‌ ఆడుతున్న నేపథ్యంలో బీసీసీఐ సెలెక్టర్లు కోహ్లీకి విశ్రాంతినిచ్చి, సారథ్య బాధ్యతలు రోహిత్ శర్మకి అప్పగించారు. ఇక ఈ టోర్నీలో భాగంగా భారత్ జట్టు 19వ తేదీన పాకిస్థాన్‌తో తలపడనుంది.

ఈ నేపథ్యంలోనే దీని గురించి పాకిస్థాన్‌ స్టార్ క్రికెటర్‌ ఫకార్‌ జమాన్‌ స్పందిస్తూ… ‘ప్రపంచంలోని మేటి జట్లలో భారత జట్టు ఒకటని, ఇక భారత జట్టులో కోహ్లీ ఉన్నా లేకపోయినా పెద్దగా తేడా ఉండదు అని అనుకుంటున్నాని తెలిపాడు. అసలు కోహ్లీ లేడని భారత జట్టును తక్కువ అంచనా వేయలేమని, కోహ్లీ అగ్రశ్రేణి ఆటగాడే అయిన టీమిండియా కూడా గొప్ప జట్టే అని కితాబిచ్చాడు. కాబట్టి ఆసియా కప్‌ టోర్నీ ఆసక్తికరంగా సాగడం ఖాయమని అన్నాడు.

ఇక పాక్‌ తరఫున ఏ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడినా ఆటగాళ్లపై చాలా ఒత్తిడి ఉంటుందని, అదే భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ అంటే ఆ ఒత్తిడి ఇంకా ఎక్కువని చెప్పుకొచ్చాడు.

మామాట: మరి కోహ్లీ లేకపోయిన భారత్ గొప్ప జట్టు అనిపించుకుంటుందా?

Leave a Reply