పవన్…అశోక్ గజపతిరాజుని అప్పటి నుంచి నువ్వే గెలిపించావా?

పవన్…అశోక్ గజపతిరాజుని అప్పటి నుంచి నువ్వే గెలిపించావా?
Views:
739

విశాఖపట్నం, 6 జూలై:

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రజా పోరాట యాత్ర పేరిట ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆయన విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా టీడీపీ ఎంపీ అశోక్ గజపతి రాజుపై విమర్శలు గుప్పించారు. తాను మద్ధతు ఇవ్వడం వల్లే 2014 ఎన్నికల్లో అశోక్ గెలిచారంటూ చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలోనే పవన్‌ కల్యాణ్‌ ఉత్తరాంధ్ర పర్యటనలో చేస్తున్న వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు.  నిన్న ఓ టీవీ చానల్‌ డిబేట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తనవల్లే అశోక్‌ గజపతి రాజు గెలిచారని, తన వల్లే టీడీపీ అధికారం అనుభవిస్తోందన్న పవన్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదమని తెలిపారు. 1983 నుంచి ఇప్పటిదాకా అశోక్‌ గజపతి రాజు ప్రతి ఎన్నికలో గెలుస్తున్నారని, 30 ఏళ్లుగా గజపతులు అనుభవించిన పదవులు ఎవరి దయతో వచ్చాయో చెప్పాలని అన్నారు.

అసలు 1983లో ఆయన గెలిచినప్పుడు పవన్‌ స్కూల్‌లో ఉండి ఉంటారని, తనవల్లే అశోక్‌గజపతిరాజు పదవులను అనుభవిస్తున్నారన్న మాటలను ఉత్తరాంధ్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు.

ఇక వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించేందుకు వైసీపీ-జనసేన పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని సబ్బం అభిప్రాయపడ్డారు.

మామాట: మీరు టీడీపీని బాగానే వెనుక వేసుకొస్తున్నారుగా…

(Visited 844 times)
%d bloggers like this: