టి‌ఆర్‌ఎస్‌కు షాక్ ఇవనున్న మరో సీనియర్ నేత…

Share Icons:

 హైదరాబాద్, 8 సెప్టెంబర్:

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఎందరో ఇతర పార్టీ నాయకుల్ని టి‌ఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడు ఆ ఆకర్షణ టికెట్ల విషయంలో లేకపోయే సరికి పార్టీ నేతల్లో అసంతృప్తులు పెరిగిపోతున్నాయి.

టికెట్లు ఆశించి భంగపడిన నేతల్లో కొందరు సొంత గూటికి చేరుతుంటే మరి కొందరు ఉన్నగూటిని వదిలి ఇతర పార్టీల కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ నేపధ్యంలోనే తనకు టికెట్ ఇవ్వలేదని మనస్థాపం చెందిన ఓ సీనియర్ నేత టి‌ఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఎవరో కాదు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్.

Image result for ramesh rathod

2009లో తెలుగుదేశం పార్టీ నుండి  ఆదిలాబాద్ ఎం‌పిగా గెలుపొందిన రమేశ్ రాథోడ్ టికెట్ ఇస్తానంటేనే టి‌ఆర్‌ఎస్ పార్టీలోకి చేరారట. ఇప్పుడు తనని కాదని ఖానాపూర్ నియోజకవర్గం టికెట్ రేఖా నాయక్‌కు ఇవ్వడంతో ఆయన తీవ్రంగా మనస్థాపం చెందారట.

దీనితో ఆయన టి‌ఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎలాగైనా ఖానాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందల్సిందే అని ఆయన కంకణం కట్టుకున్నారట.

ఇక ఎప్పుడైతే రేఖా నాయక్‌ను టి‌ఆర్‌ఎస్ తమ అభ్యర్ధిగా ప్రకటించిందో అప్పటి నుండే ఆమెపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రేఖా నాయక్ కమీషన్ల కోసం ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని, ప్రజల్లో ఆమెపై వ్యతిరేకత ఉన్నట్లు రమేశ్ ఆరోపించారు.

తనకు అన్యాయం చేసిన టి‌ఆర్‌ఎస్ పార్టీకి బుద్ది చెప్పేందుకు వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగి తన బలం ఏంటో నిరూపించి సత్తా చాటాలనుకున్నట్టు ఆయన తెలిపారు. కార్యకర్తలతో సమావేశమై తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నట్లు రమేష్ రాథోడ్ స్పష్టం చేశారు.

మామాట: మరి ఏ పార్టీలోకి చేరతారో….

Leave a Reply