జనసేనలోకి మాజీ ఎంపీ…?

ex mp harshakumar is ready to joins janasena?
Share Icons:

అమలాపురం, 3 అక్టోబర్:

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని చూస్తున్న కొందరు నేతలు పార్టీలు మారే పనిలో పడ్డారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీలు మారిపోగా, మరికొందరు నేతలు ఏ పార్టీలో చేరాలనే విషయమై తర్జనభర్జనలు పడుతున్నారు. ఈ క్రమంలోనే జనసేనలో చేరే విషయాన్ని కాదనలేనని మాజీ ఎంపీ హర్షకుమార్ చెప్పారు. ఏ పార్టీలో చేరాలనే విషయాన్ని అనుచరులతో చర్చించి నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు ఆయన స్పష్టత ఇచ్చారు.

బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీలోనే తన రాజకీయ ప్రయాణం ప్రారంభమైందని ఆయన చెప్పారు. ఇంటర్, డిగ్రీలో కాంగ్రెస్ తో తన అనుబంధం ఉందన్నారు.

అలాగే కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ గల సైనికుడిగా పనిచేసినట్టు ఆయన గుర్తు చేసుకొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ టీడీపీపై నిరంతరం పోరాటం చేసినట్టు చెప్పారు. తెలంగాణలో టీడీపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం తనకు బాధ కల్గించిందని, దీంతోనే కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరాలనే ఆలోచనను విరమించుకొన్నట్టు ఆయన చెప్పారు.

ఇక కొన్ని పార్టీలు తనతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు. తన అనుచరులతో చర్చించి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకొంటామని తెలిపారు.

మామాట: సీటు వస్తే చాలు అనుకుంటా ఏ పార్టీ అయితే ఏముంది….

Leave a Reply