హైదరాబాద్, 8 సెప్టెంబర్:
తెలంగాణలో ముందస్తు ఎన్నికల సందర్భంగా నాయకుల వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు పార్టీల కండువాలు మార్చుకోగా, మరికొందరు నాయకులు కూడా అదే పనిలో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే బీజేపీకి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది సేపటి క్రితం ఆయన తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జీ నేత కుంతియాతో భేటీ అయ్యారు. త్వరలో కాంగ్రెస్‌లో నందీశ్వర్‌గౌడ్ చేరనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధిష్టానం నుండి పటాన్చెరు నియోజకవర్గం పై స్పష్టమైన హామీవచ్చినట్లు తెలుస్తోంది.
కాగా, ప్రస్తుతం ఆయన పటాన్చెరు బీజేపీ ఇన్‌చార్జీగా ఉన్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో పటాన్చెరు నుంచి నందీశ్వర్‌గౌడ్ కాంగ్రెస్ తరుపున పోటీ చేసి గెలుపొందారు.
ఇది ఇలా ఉంటే అయితే రానున్న ఎన్నికలను కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేసే ప్రతి పార్టీని కలుపుకునిపోయే దిశగా పయనిస్తోంది. ఇప్పటికే సీపీఐ, ఆ పార్టీతో కలిసి పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
మామాట: సీటు ఉంటే పార్టీ మారడం ఖాయమే….