ఈవీఎంల భద్రతకు కేంద్రబలగాలు…ఏపీ పోలీసులపై నమ్మకం లేదు.. విజయసాయిరెడ్డి

Share Icons:

హైదరాబాద్, ఏప్రిల్ 13,

స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన ఈవీఎంలకు రక్షణగా కేంద్ర రక్షణ బలగాలను వినియోగించాలని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయ్ సాయి రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద రాష్ట్ర పోలీసులకు బదులు కేంద్ర పోలీసులనే స్ట్రాంగ్ రూమ్ వద్ద కాపలా ఉంచాలని అందులో ప్రధానంగా కోరారు. సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ బలగాలతో పహారా ఏర్పాటు చేయాలని విజయ్ సాయి రెడ్డి పేర్కొన్నారు.

అంతేకాదు 24 గంటల పాటు సీసీకెమెరాల ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించవద్దని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా సీఈవోకు చెబుతున్నారని, ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, కేంద్ర పోలీసులతో స్ట్రాంగ్ రూమ్ వద్ద పహారా ఏర్పాుట చేయాలని విజయసాయి రెడ్డి లేఖలో ప్రధానంగా పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, ఎన్నికల్లో ఈవీఎంల మొరాయింపుపై చంద్రబాబునాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విజయసాయి రెడ్డి లేఖ ప్రాముఖ్యత సంతరించుకుంది.

మామాట: మరీ ఇలా అంటే ఎట్లా సారూ…

Leave a Reply