ఈవీఎంలను   హ్యాక్ చేయొచ్చు.. వేమూరి హరిక్రిష్ణ

Share Icons:

కొత్తఢిల్లీ, ఏప్రిల్15,

మన దేశంలో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఓటింగ్ విధానంలో ఈవీఎంల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందువలన పలితాలు వెల్లడించడంలో చాల తక్కువ సమయం పడుతుంది. అయితే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఎవరైనా హ్యాక్ చేయవచ్చు అని ఏపీ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు వేమూరి హరిక్రిష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.ఏపీలో ఇటీవలే ముగిసిన ఎన్నికలలో ఈ విషయం అర్ధమైందన్నారు.

ఓటు వేశాక వీవీప్యాట్లలో 7 సెకన్ల పాటు కనిపించాల్సిన స్లిప్, 3 సెకన్ల పాటే కనిపించిందంటే  అందులో ఏదో తేడా జరిగిందని, బహుశా కోడ్ మారి ఉండవచ్చు అని ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్ళామని అన్నారు. అయితే ఈవీఎంలపై అనేక సందేహాలు ఉండడం వలన ఎన్నికలకు పేపర్ బ్యాలెట్‌ను వాడడమే మంచిదని అన్నారు. ప్రపంచంలో చాలా దేశాలు పేపర్ బ్యాలెట్ నే వాడుతున్నాయని  ఆయన గుర్తు చేశారు. ఆ దేశాలు సాంకేతికంగా మనకంటే చాలాముందున్నాయన్నారు.

మామాట: పేపర్ బ్యాలెట్ అయితే మనమే గుద్దుకోవచ్చు కదా

Leave a Reply