గెలిస్తే నేనే-ఓడిపోతే ఈవీఎం పాపం

poll 57 evm tampering congress telangana
Share Icons:

తిరుపతి, డిసెంబర్ 11,

ఆడలేనమ్మ మద్దెల ఓడన్నదని సామెత.. అది ఇపుడెందుకు గురుతొచ్చింది అంటారా… మీరే చదవండి…

[pinpoll id=”66673″]

వచ్చే లోక్సభ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా పిలుచుకున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు- ఫలితాలు రాజకీయ పరిశీలకులను కూడా కొంతవరకు అయోమయానికి గురిచేశాయి.  ఉత్తరాది మీడియా ఒకలా, స్థానిక నిపుణులుగాభావించే వారు ఒకలా ఎక్జిట్ పోల్ సర్వే ఫలితాలు ప్రకటించి, అయోమయం కలిగించారు. కానీ, తెలంగాణ రాష్ట్రం సాధించిన తొలి ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టబోయిన తెరాస పార్టీ, చంద్రశేఖర రావు ఈ ఎన్నికల్లో మరింత గొప్పవిజయాన్ని దుకున్నారు. పాలక పార్టీపై వ్యతిరేకత ఉందన్న వాదన కూడా తుడిచిపెట్టుకుపోయింది.

కాంగ్రెస్-తెలుగుదేశం కలిసి నడవడాన్ని తెలంగాణ ప్రజలే కాదు గ్రేటర్ హైదరాబాద్ లోని సెటిలర్లు కూడా అంగీకరించినట్టు లేదని ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్న సమయంలో… ఈవీఎం యంత్రాలను తెరాసా-బీజేపీ కలిసి మాయ చేశాయని. ఈ ఎన్నికలు సాంకేతికత  సాయంతో ప్రజాభిప్రాయానికి సమాధికట్టాయని తెలంగాణ కాంగ్రెస్  నేతలు మరో మారు ట్యాంపరింగ్ వాదాన్ని భుజానికెత్తుకున్నారు. గతంలో కంటే పెరిగిన సాంకేతిక విజ్ఞానం కారణంగా బ్లూటూత్ విధానంలో ఈవీయం పరికరాలను మార్చ వచ్చా, అలా చేయగలిగినపుడు ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ అలా ఎందుకు చేయలేకపోయింది.  మీరేమంటారు. ఆధునిక సాంకేతికత సహాయంతో మార్పు చేర్పులు చేయవచ్చనడాన్ని అంగీకరిస్తారా.

మామాట:  కాంగ్రెస్ పార్టీ …  తెలంగాణ తెలుగుదేశం మురికిలో మునిగి పోయిందా..

Leave a Reply