ఇపుడు కూడా రాజకీయాలా బాబూ!

poll 43 Did you Support U
Share Icons:

ప్రజాస్వామ్యంలో వ్యక్తులను తొలగించే అంశం నీచమైనది. మనిషిని లేకుండా చేస్తే లేదా అడ్డుతొలగించుకుంటే ఎదురు వుండదని భావించే పాలక వర్గాలు చరిత్రను మరచిపోయినట్లే. గతం నుంచి గుణపాఠం నేర్వనట్టే.

[pinpoll id=”64242″]

గురువారం మధ్యాహ్నం గట్టి రక్షణ వలయంలో ఉండే విశాఖ విమానాశ్రయం విఐపీ లాంజ్ లో విపక్షనేత జగన్ పై ఓ యువకుడు కత్తితో దాడిచేశాడు. దీనితో జగన్ ఎడమ భుజానికి గాయమైంది. గాయం చిన్నదే, ప్రాణాపాయం లేదు అన్నవాదన ప్రస్తుతానికి మంచిదే కానీ, కేబినెట్ మంత్రి హోదాలోని వ్యక్తిపై, అదీ కేంద్ర సాయుధ రక్షణదళాల పహారాలో ఉన్న చోట దాడి జరగడంపై చాలా అనుమానాలు ఉన్నాయి. పెద్ద స్థాయి వ్యక్తుల జోక్యం లేకుండా ఇటువంటివి జరగవు. కేవలం ప్రచారం కోసం అయితే… జగన్ నిత్యం పాద యాత్ర పేరుతో జనంలోనే నడుస్తున్నాడు.

విశాఖ విమానాశ్రయంతో పోల్చినపుడు పాదయాత్రలో ఉండే రక్షణ నామమాత్రమైనది. అక్కడెక్కడా దాడి జరక్కుండా  సురక్షితమైన ప్రాంతంలో, నిత్యం నిఘా నీడలో, సీసీ కెమెరాల పరిధిలో ఉన్నచోట దాడి ఎందుకు జరిగింది. ఎవరు చేయించారు. దీనివలన లాభం ఎవరికి, నష్ట్టం ఎవరికి అనే ప్రశ్నలు కాదు. ప్రతిపక్ష నేతపై జరిగిన దాడిని అందరూ ఖండించాలి. మళ్లీ ఇటువంటివి చోటు చేసుకోకుండా కఠినంగా వ్యవహరించాలి.

మామాట: ప్రజాస్వామ్యంలో ఓటు మాత్రమే పాలకులను నిర్ణయించాలి కత్తులు కాదు.

Leave a Reply