ఈటల రాజేందర్ ఢిల్లీ టూర్ = టీఆర్ యస్ లో కలవరం

Share Icons:
  • ఈటల తో ఎవరెవరు టచ్ లో ఉన్నారనే దానిపై ఆరా !
  • బీజేపీ లో చేరికపై టీఆర్ యస్ లో శ్రేణుల అలర్ట్
  • ఈటల పై ఎదురురు దాడికి సన్నద్ధం
  • ఆత్మగౌరం బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారన్న పల్లా
  • దీటుగా జవాబు ఇవ్వాలని కేసీఆర్ ఆదేశాలు
  • హుజురాబాద్ లో టీఆర్ యస్ నేతలు ఈటలతో వెళ్లకుండా చూడాలని ఆదేశాలు

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీ టూర్ బీజేపీ నేతలను కలవడం బీజేపీ లో చేరుతున్నట్లు వార్తలు రావడంతో టీఆర్ యస్ లో కలవరం మొదలైంది . కేసీఆర్ టీఆర్ యస్ శ్రేణులను అలర్ట్ చేశారు . ఎదురుదానికి టీఆర్ యస్ సన్నద్ధమైంది . ఈటల క్షమించరాని తప్పుచేశారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈటలపై ధ్వజమెత్తారు . ఆత్మగౌరం గురించి మాట్లాడే ఆయన ఇప్పుడు తన ఆత్మగౌరవాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారని ప్రశ్నించారు. ఈటల విమర్శలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి కె అరుణ మాట్లాడుతూ ఎమ్మెల్సీ గా ఎన్నికైయ్యందుకు 150 ఖర్చు చేసిన పల్లా కు ఈటలను విమర్శించే అర్హత లేదని అన్నారు ..

ఈటల ఇప్పటివరకు బీజేపీ లో చేరబోరని గతంలో ఆయన బ్యాక్ గ్రౌండ్ వామపక్ష వాది అయినందున బీజేపీ విధానాలు నచ్చవని ఇటు పార్టీ నాయకులూ , అటు ఇంటలిజెన్స్ వర్గాలు సీఎం కేసీఆర్ కు రిపోర్ట్ ఇచ్చాయి. కాని అందుకు భిన్నంగా ఈటల రూటు మార్చారు. బీజేపీ కి దగ్గర అయితే తప్ప తనను ప్రస్తుత పరిస్థితులలో ప్రొటెక్ట్ చేసేవాళ్ళు లేరని నిర్దారణకు వచ్చిన ఈటల అనివార్య పరిస్థితులలో కమలం వైపుకు నెట్టబడ్డారు. కాంగ్రెస్ లో చేరదామని ఆయన భావించిన కాంగ్రెస్ వాళ్ళు , వాళ్ళని వల్లే రక్షించుకోలేని పరిస్థితి ,ఇక తటస్తం అనేది కుదరని పని ఐక్యవేదిక ప్రతిపాదన వచ్చినప్పటికీ అది పెగులుతుందో లేదో తెలియని సందేహాలు …. అందువల్ల ఉన్నంతలో ఈటలకు బెస్ట్ ఆప్షన్ బీజేపీనే అని భావించారు.

ఈటల  బీజేపీలో కి వెళ్లడం టీఆర్ యస్ లో కలవరానికి కారణమైంది . అందువల్ల గులాబీ బాస్ సీరియస్ అయ్యారు. ఢిల్లీలో ఈటల బీజేపీ అగ్రనేతలతో జరుపుతున్న వరస సమావేశాలపై సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నారు. జూన్ 2 తర్వాత ఈటల పై వేటుకు టీఆర్ఎస్ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు ఎమ్మెల్యే పదవిపై కూడా స్పీకర్ కు ఫిర్యాదు చేయనున్నారు. ఈటల రాజేందర్ తో పాటు బీజేపీ నేతలకు టచ్ లో ఉన్న మిగతా నేతలపై కూడా వేటు వేయనున్నారు. ఇప్పటికే హుజురాబాద్లో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ , ఈటల తో వెళ్లే నాయకుల జాబితా ను సిద్ధం చేస్తున్నారు. మంత్రి వర్గంలో కొరకరాని కొయ్యగా ఉన్న ఈటల రాజేందర్ పై వేటుకు ఎదురుచూస్తున్న కేసీఆర్ అతి చిన్న కారణం ఎతుకున్నారనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

చాలామంది ఎమ్మెల్యేలపైనా మంత్రిలపైనా , మాజీలపైనా భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. వారి ఎవరిమీద తీసుకోని చర్యలు కేవలం ఈటలమీద తీసుకోవడానికి గల కారణాలు ప్రజలను కన్వెన్స్ చేయలేక పోతున్నాయి. …ఈటలను భూకబ్జా ఆరోపణలతో మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేశారు. అదికూడా అక్కడ గ్రామస్తులు నేరుగా ప్రగతి భవన్ కువెళ్లి ఫిర్యాదు చేయడం, ఈ ఫిర్యాదు ను స్వీకరించిన కేసీఆర్ వెంటనే విచారణకు ఆదేశించడం విచారణ రిపోర్ట్ ఆఘమేఘాల మీద రావడం మంత్రి పై యాక్షన్ తీసుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. అదికూడా మున్సిపల్ , నాగార్జున సాగర్ ఉపఎన్నిక అయిన వెంటనే ఈటల పై వేటుకు రంగం సిద్ధం చేయడం గమనార్హం . ఈ విషయంలో పైకి చెప్పకపోయినా ఇది కావాలని చేసిందే అని టీఆర్ యస్ నాయకులే ప్రవేట్ సంభాషణలలో చెబుతున్నారు. ఇప్పుడు కీం కర్తవ్యం అనే ఆలోచనలో టీఆర్ యస్ పడింది. స్పీకర్ కు ఫిర్యాదు చేస్తే వెంటనే అనర్హత వేటు వేయాలా లేక కొంతకాలం పెండింగ్ లో ఉంచి తమకు అనుకలంగా ఉందని అనుకున్నపుడు చర్యలు తీసుకునే అవకాశాన్ని పరిశీలించాలి అనే మీమాంస లో ఉన్నారు . ఏదైనా అటు టీఆర్ యస్ కు ,ఇటు ఈటలకు హుజురాబాద్ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారనున్నదనడంలో ఎలాంటి సందేహం లేదు …

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply