హరీశ్ ! గుండె మీద చేయి వేసుకుని చెప్పు: ఈటల రాజేందర్! ఈటలది మొసలి కన్నీరు: హరీశ్!

Share Icons:
  • హుజూరాబాద్ ఉప ఎన్నిక – మాటల యుద్ధం… ఈటల & హరీశ్

ఎన్నికల తేదీలు  ప్రకటించలేదు ….అయినా హుజురాబాద్ లో ఈటల – హరీష్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. హరీష్ రావు నువ్వు గుండెమీద చేయివేసుకొని చెప్పు అంటే … ఈటల ముసలి కన్నీరు కారుస్తున్నారని హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. మంత్రి హరీశ్ రావు, మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఇరువురు తీవ్ర విమర్శలు చేసుకుంటూ వేడి పుట్టిస్తున్నారు.. టీఆర్ఎస్ పార్టీలో హరీశ్ రావు ఒక రబ్బరు స్టాంప్ వంటివారని,. తాను సీఎం కావాలని అనుకున్నానని హరీశ్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని చెప్పారు. ఈ విషయాన్ని హరీశ్ గుండెల మీద చేయి వేసుకుని చెప్పాలని  ఈటల అన్నారు.

పార్టీకి తాను రాజీనామా చేయలేదని… తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా చేయాలని చెపితేనే చేశానని తెలిపారు. హరీశ్ కు మామ కేసీఆర్ ఉన్నారని… ఆయన మాదిరి తాను వారసత్వంతో రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. అడుగులకు మడుగులు ఒత్తేవారికే ప్రగతి భవన్ లోకి ఎంట్రీ ఉంటుందని అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక కేవలం రిహార్సల్ మాత్రమేనని చెప్పారు.  హరీశ్ రావు మాట్లాడుతూ, ఈటలది మొసలి కన్నీరు అని, టీఆర్ఎస్ పార్టీ ఈటలకు ఎంతో గౌరవం ఇచ్చిందని, ఒక్క సీఎం పదవి తప్ప అన్ని పదవులు కల్పించిందని వెల్లడించారు. కానీ, ఈటల వ్యవహారం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా ఉందని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవం గురించి మాట్లాడే ఈటల బొట్టుబిళ్లలు, కుట్టు మిషన్లు ఎందుకు పంచుతున్నారని ప్రశ్నించారు.

హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో చేనేత కార్మికులకు ఆర్థిక ఆసరా నిమిత్తం చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. తమది పనిచేసే ప్రభుత్వం అని, బీజేపీ నేతలవి వట్టి మాటలేనని అన్నారు. బీజేపీ నేతలు తెలంగాణ అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని హరీశ్ విమర్శించారు.

కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply