TRENDING NOW

‘ఎర్రోడి వీరగాధ’.. బాలయ్యపై నాగబాబు షార్ట్ ఫిల్మ్!(వీడియో)

‘ఎర్రోడి వీరగాధ’.. బాలయ్యపై నాగబాబు షార్ట్ ఫిల్మ్!(వీడియో)

హైదరాబాద్, జనవరి 09

ఇప్పటివరకు నందమూరి బాలకృష్ణ పలు సంధర్భాల్లో చేసిన కామెంట్స్ కి మెగాబ్రదర్ నాగబాబు వీడియోల రూపంలో కౌంటర్లు వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఐదు కామెంట్లకు కౌంటర్లు ఇచ్చిన నాగబాబు తాజాగా ఆరో కామెంట్ కి వినూత్నంగా కౌంటర్ ఇచ్చాడు.

ఓ సినిమా ఆడియో ఫంక్షన్ లో బాలకృష్ణ ”ఆడపిల్ల కనబడితే ముద్దైనా పెట్టాలి, లేదా కడుపైనా చేయాలి” అన్నాడు. ఆ సమయంలో బాలయ్య మాటలు వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు ఆ కామెంట్స్ ఆధారంగా నాగబాబు ఓ షార్ట్ ఫిల్మ్ ని విడుదల చేశాడు. ఆయన స్వయంగా నటించిన ఈ షార్ట్ ఫిల్మ్ కి ‘ఎర్రోడి వీరగాధ’ అనే టైటిల్ పెట్టాడు. ఇందులో ఒక వ్యక్తిని పట్టుకొని మహిళలు అందరూ కొడుతూ ఉంటారు..

అది చూసిన నాగబాబు ఆపాలని అనుకుంటాడు కానీ మనకెందుకులే అని వెళ్ళిపోతాడు.. మళ్లీ అతడినే మరో సెంటర్ దగ్గర కొట్టడం చూసిన నాగబాబు లైట్ తీసుకుంటాడు. ఈసారి ఆ వ్యక్తి నాగబాబు కారుకి అడ్డంగా వచ్చి పడడంతో విషయం ఏంటో తెలుసుకోవాలని కారు దిగిన నాగబాబుతో సదరు వ్యక్తి.. ”ఆడపిల్ల కనబడితే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని పెద్దలు అన్నారు కదా..అని నేను ముద్దు పెట్టడానికి ప్రయత్నించానని” చెబుతాడు.

దీంతో ఆడవాళ్లను పిలిపించి మరీ అతడిని కొట్టమని సపోర్ట్ చేస్తాడు నాగబాబు. ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా బాలయ్యని ఎర్రోడిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు నాగబాబు. మరి ఈ వీడియో చూసిన నందమూరి అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి!

 

 

మామాట: మరో వైపునుంచి దాడి మొదలవుద్దా.. 

(Visited 25 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: