యాషెస్ లో ఊహించని విజయం అందుకున్న ఇంగ్లండ్…

england won the second test against australia
Share Icons:

లండన్:

టీ20, వన్డే క్రికెట్ కంటే టెస్ట్ క్రికెట్ తోపు అని మరోసారి రుజువు చేసింది. సరిగా పోరాటం జరిగితే టెస్ట్ క్రికెట్ ని మించింది మరొకటి లేదు. అలాంటి పోరాటమే యాషెస్ టెస్ట్ సిరీస్ లో ఇంగ్లండ్ జట్టు చేసింది. మ్యాచ్ నాలుగో రోజైన ఆదివారం మ్యాచ్ ఎన్నో మలుపులు తిరగగా 359 పరుగుల లక్ష్యాన్ని ఓ వికెట్ మిగిలుండగా ఇంగ్లిష్ జట్టు ఛేదించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఆ జట్టుకు ఇదే అత్యధిక లక్ష్యఛేదన.

ఓవర్‌నైట్ స్కోరు 156-3తో నాలుగో రోజు ఆటకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. రూట్(77) త్వరగానే ఔట్ కాగా.. ఆ తర్వాతి వికెట్‌కు బెయిర్‌స్టో(36) సాయంతో స్టోక్స్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఐదో వికెట్‌కు 86 పరుగులు జత చేయడంతో చేశాక బెయిర్‌స్టో ఔట్ కాగా, కాసేపటికే బట్లర్(1), వోక్స్(1)ను వెనుదిరిగారు. ఇక ఆర్చర్(15), బ్రాడ్(0) కూడా కాసేపటికే ఔట్‌కాగా, విజయానికి 76 పరుగులు అవసరమైన సమయంలో లీచ్ చివరి బ్యాట్స్‌మన్‌గా స్టోక్స్‌కు జతగా బరిలోకి దిగాడు.

అయితే లీచ్(1నాటౌట్)ను నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌కే పరిమతం చేస్తూ 76 పరుగులు జోడించి.. అద్భుతం చేసి బెన్ స్టోక్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ను అందుకున్నాడు.  ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల యాషెస్ సిరీస్ 1-1తో సమం కాగా నాలుగో మ్యాచ్ వచ్చే నెల 4న ప్రారంభం కానుంది. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ 4, లైయాన్ 2వికెట్లు తీశారు.

 

Leave a Reply