ప్రపంచకప్‌లో ఆడే ఇంగ్లాండ్‌ జట్టు

Share Icons:

లండన్‌, మే 22,

సొంత గడ్డపై వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే ఇంగ్లాండ్‌ జట్టును ఆ దేశ క్రికెట్‌ బోర్డు మంగళవారం నాడు ప్రకటించింది. 15 మంది సభ్యులు గల జట్టులో అందరూ ఆశ్చర్యపడేలా యువ ఆల్‌రౌండర్‌ జోఫ్రా ఆర్చర్‌కు చోటు కల్పించారు. ఆర్చర్‌తో పాటు జేమ్స్‌ విన్స్‌, లియామ్‌ డాసన్‌కు చోటు దక్కగా.. డేవిడ్‌విల్లే, అలెక్స్‌ హేల్స్‌, జోయ్‌ డెన్లీలకు ఉద్వాసన పలికారు.

నిలకడైన బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు తీవ్ర ఒత్తిడి పరిస్థితుల్లోనూ సత్తాచాటే ఆటగాళ్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లు ప్రపంచవ్యాప్తంగా అన్ని వేదికల్లో, సిరీస్‌ల్లో సత్తా చాటిన వారే కావడం ఆ టీమ్‌కు కలిసొచ్చే అంశం.

ఇంగ్లాండ్‌ జట్టు:

ఇయాన్‌ మోర్గాన్‌ (కెప్టెన్‌), జేసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌స్టో (వికెట్‌ కీపర్‌), జేమ్స్‌ విన్స్‌, జో రూట్‌, బెన్‌స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌ (వికెట్‌ కీపర్‌), మొయిన్‌ అలీ, అదిల్‌ రషీద్‌, లియామ్‌ డాసన్‌, క్రిస్‌వోక్స్‌, లియామ్‌ ఫ్లంకెట్‌, జోఫ్రా ఆర్చర్‌, టామ్‌ కర్రన్‌.

Leave a Reply