సెప్టెంబర్ 12న ‘ఎందుకో ఏమో’  విడుదల

enduko emo released September 12 th
Share Icons:

హైదరాబాద్, 31 ఆగష్టు:

మ‌హేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై నందు, నోయ‌ల్, పున‌ర్న‌వి హీరో హీరోయిన్లుగా కోటి వ‌ద్దినేని ద‌ర్శ‌కత్వంలో మాల‌తి వ‌ద్దినేని నిర్మిస్తోన్న చిత్రం `ఎందుకో ఏమో`. ఇటీవల ఈ చిత్రం టీజర్, సాంగ్స్ విడుదలై సినిమాపై మంచి క్రేజ్‌ని ఏర్పరిచాయి. అన్ని కార్యాక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 12న వినాయక చవితి కానుకగా విడుదలవుతుంది.

ఈ సందర్భంగా దర్శకుడు కోటి వ‌ద్దినేని మాట్లాడుతూ… “ఎందుకో ఎమో” సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నానని, నందు, నోయ‌ల్, పున‌ర్న‌వి హీరో హీరోయిన్లుగా న‌టించారని తెలిపారు. ఇక ఇదొక ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరి అని, కథ, కథనాలు కొత్తగా ఉంటూ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధమైన ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పారు.

అలాగే నిర్మాత మాల‌తి వ‌ద్దినేని మాట్లాడుతూ… మ‌హేశ్వ‌ర క్ర్రియేష‌న్స్ ప‌తాకంపై ఇది తమ తొలి సినిమా అని, వినాయ‌క్ చేతుల మీదుగా విడుదలైన టీజర్‌కు, బోయపాటి శ్రీను చేతుల మీదుగా రిలీజ్ అయినా పాటలకు మంచి  రెస్పాన్స్ వస్తోందని తెలిపారు.  మంచి ల‌వ్ స్టోరీతో పాటు క‌మ‌ర్షియ‌ల్ హంగులు కూడా సినిమాలో ఉన్నాయని, అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే సినిమా అవుతుందని అన్నారు.

మామాట: కథ బాగుంటే ప్రేక్షకులు ఏ చిత్రాన్ని అయిన ఆదరిస్తారు…

Leave a Reply