ముగిసిన జగన్ ప్రజాప్రస్థానం యాత్ర

Share Icons:

 

సాధారణంగా రాజకీయాలలో ఒకే పని పలుమార్లు చేసే అవకాశం రాదు. ముఖ్యంగా మంచి పనులు. దాడులు, నిరసనలు, గొడవలు చేయవచ్చు.  చెప్పులు విసురుకోవడం, కుర్చీలు విరిచేయడం, జెండాలు చించేయడం కాదు..

[pinpoll id=”67838″]

ఇక్కడ మనం చూస్తున్నది  ప్రజలకోసం, వారి కష్ట సుఖాలు తెలుసుకోవడం కోసం, జనసామాన్యంలో మమేకం కావడం కోసం. ఒకరు కాదు ముగ్గురు. అదే ఒకే కుటుంబానికి చెందిన వారు. ఒకే రక్తం పంచుకున్నవారు  నెలల తరబడి పాదయాత్ర చేయడం. పేదలు, బడుగువర్గాలను అక్కున చేర్చుకోవడం. ఇటువంటిది గతంలో కనీ వినీ ఎరుగనటువంటిది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, ఆయన కుమార్తె షర్మిల, కుమారుడు, ప్రతిపక్షనేత, వైయస్ ఆర్ సీపీ అధినేత జగన్ ముగ్గురూ ప్రజలకోసం కాలినడకన రాష్ట్రంలో పర్యంటించడం రికార్డు. ఎండనక వాననక వారు సాగించిన ప్రస్థానం అనితర సాధ్యం.

ప్రస్తుతం  జగన్ మోహన్ రెడ్డి దాదాపు 341 రోజులుగా, 3,648 కిలోమీటర్లు 2,516 గ్రామాల గుండా సాగించిన పాదయాత్ర నేడు జనవరి 9 వ తేదీ న ఇచ్చాపురంలో ముగుస్తోంది. ప్రజా సమస్యలు స్వయంగా తెలుసుకోవడం కోసం జగన్ నిర్వహించిన ఈ ప్రజాప్రస్థానం ముగుస్తోంది. కానీ తద్వారా ఆన ప్రజల గుండెల్లో నాటిన ప్రేమాభిమానాల మొక్క మరింత బలంగా ఎదుగుతోంది. అవునంటారా కాదంటారా.

మామాట: ఒకే కుటుంబం, ఒకే పథం, ఒకే శపథం, ఒకే ప్రజాపథం…ఇదో వినూత్నం.

Leave a Reply