ఆ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం షాక్…జీతాలు రివర్స్

cm jagan serious discussion on sand issue in ap
Share Icons:

 

అమరావతి: ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కొత్తగా అనేక ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు అనేక వరాలు ఇచ్చారు. అయితే ఓ శాఖలో పని చేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ షాక్ ఇచ్చారు.  ఆంధ్రప్రదేశ్ మహిళ, శిశుసంక్షేమశాఖలో కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేసే ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం రివర్స్ అస్త్రం ప్రయోగించినట్టు సమాచారం. గత ప్రభుత్వం హయాంలో ఈ శాఖలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలను రూ. 3వేల నుంచి రూ 7వేల రూపాయలకు పెంచారు. దీంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం వీరిపై రివర్స్ అస్త్రం ప్రయోగించింది.

పెంచిన జీతాలను ఉద్యోగులను వెనక్కి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. దీంతో స్త్రీశిశు సంక్షేమ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే ఇచ్చి ఇప్పుడు తిరిగి ఇచ్చెయ్యమంటేఎలా అని వారు వాపోతున్నారు. ఇప్పటి వరకు అందుకున్న పెరిగిన జీతం మొత్తం తిరిగి చెల్లించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి.అంతపెద్ద మొత్తంలో డబ్బును ఇప్పుడు ఎక్కడినుంచి తెచ్చి ఇవ్వాలని ఆందోళన చెందుతున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు గందరగోళంలో ఉన్నారు .

ఇదిలా ఉంటే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు గత సోమవారం నుంచి బయోమెట్రిక్‌ హాజరు వేయాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇదివరకే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇకపై ఏపీ సచివాలయ ఉద్యోగులు సమయానికి తమ విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రజలకు వారు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఏపీ సర్కార్ ఈ చర్యలు చేపట్టింది. ఇకనుంచి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు ప్రతిరోజూ బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేసుకోవాలని సూచించారు.

 

Leave a Reply