రాహుల్ ని టార్గెట్ చేసిన ఇంటిసభ్యులు…వెక్కి వెక్కి ఏడ్చిన బాబా

Share Icons:

హైదరాబాద్:

 

బిగ్ బాస్ సీజ‌న్ 3 షో సోమవారం ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. గ‌త వారం రోహిణి ఇంటి నుండి బ‌య‌ట‌కి వెళ్ల‌గా ప్ర‌స్తుతం 12 మంది స‌భ్యులు ఉన్నారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ మొదలైంది. అయితే అలీ కెప్టెన్ కావ‌డంతో ఆయ‌నకి న‌లుగురిని డైరెక్ట్‌గా నామినేట్ చేసే అవ‌కాశాన్ని ఇచ్చారు. అలీ .. బాబా భాస్కర్, రాహుల్, హిమజ, వితికా పేర్లను సూచించారు.  అలీని బుజ్జ‌గించి, లాలించి, న‌చ్చ జెప్పి ఆయ‌న మ‌న‌సు మార్చిన వారు ఎవ‌రైతే ఉంటారో వారు సేఫ్ అవుతారు, ఒక్క‌రు నామినేట్ అవుతారు అని బిగ్ బాస్ తెలిపారు.

 

ఆ త‌ర్వాత కోర్టు యార్డ్‌లో కూర్చున్న ఇంటి స‌భ్యుల‌కి సంబంధించిన నామినేష‌న్ ప్ర‌క్రియ మొద‌లు పెట్టారు. ఒక్కొక్కరు ఇద్దరినీ నామినేట్ చేయాలని, అలాగే వారిని ఎందుకు చేస్తున్నామో కూడా చెప్పాలని అన్నారు. మొదటిగా రంగంలోకి దిగిన పునర్నవి.. హిమజ, రాహుల్‌కి రంగు పూసి నామినేట్ చేసింది. ఇక బాబా భాస్కర్.. రాహుల్, అషుకి రంగు పూసి నామినేట్ చేశాడు. ర‌వి.. రాహుల్, హిమజలని, వితికా షెరు… మహేష్ విట్టా, అషుల‌ని నామినేట్ చేస్తున్న‌ట్టు తెలిపింది.

 

శ్రీముఖి.. రాహుల్ సిప్లిగంజ్, అషు ల‌ని నామినేట్ చేసింది. ఇక రాహుల్‌.. హిమజ, శ్రీముఖి ల‌ని నామినేట్ చేశాడు. అషు.. హిమజ, రాహుల్ కి రంగు పూసి నామినేట్ చేసింది. వరుణ్..రాహుల్, మహేష్ విట్టా లకి రంగు పూసి నామినేట్ చేశాడు. శివజ్యోతి..పునర్నవి, రాహుల్‌ని నామినేట్ చేసింది. మహేష్ విట్టా.. రాహుల్, వరుణ్ సందేశ్ కి రంగు పూసి నామినేట్ చేశాడు. ఇక హిమజకి.. పునర్నవి, అషుల‌కి రంగు పూసి నామినేట్ చేసింది. ఇక అలీ కెప్టెన్ కాగా, ఆయ‌న చెప్పిన న‌లుగురిలో నామినేట్ కాని ఓ వ్య‌క్తిని ఎన్నుకోవాల‌ని బిగ్ బాస్ చెప్ప‌డంతో అలీ.. బాబా భాస్కర్‌‌ను నామినేట్ చేశారు.

 

అయితే గ‌త వారం చేసిన చిన్న పొర‌పాటు వ‌ల‌న శివ‌జ్యోతి ఈ వారం డైరెక్ట్‌గా నామినేట్ అయిన సంగ‌తి తెలిసిందే. మొత్తంగా ఐదో వారంలో రాహుల్, హిమజ, అషు, మహేష్, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్‌లు ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. అయితే హౌజ్‌లో అంద‌రికన్నా ఎక్కువ స‌ర‌దాగా ఉండే బాబా భాస్క‌ర్ త‌న బాధ‌ని శ్రీముఖికి చెప్పుకొని క‌న్నీటి ప‌ర్యంతం అయ్యాడు. అలీ త‌న‌ని నామినేష‌న్‌లో సీరియ‌స్‌గా ఉండ‌మ‌ని చెప్ప‌గా, అలాగే ఉన్నాను. అయిన‌ప్ప‌టికి న‌న్ను నామినేట్ చేయ‌డం బాగోలేదు అని చెబుతూ ఏడ్చేశాడు.

 

Leave a Reply