అలీ లేడని ఏడ్చిన జ్యోతి…ఎలిమినేషన్ లో ఆ ఐదుగురు…

elimination nominations in big boss house..ravi safe
Share Icons:

హైదరాబాద్:

రోజులు గడుస్తున్న కొద్దీ బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతుంది. మొన్న ఎపిసోడ్ లో అలీ ఎలిమినేట్ కావడంతో ఇంటి సభ్యులందరూ కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇక సోమవారం ఎపిసోడ్ లో అలీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఎపిసోడ్ ప్రారంభం కావడమే శివజ్యోతి అలీ కోసం ఏడ్చింది. ఆమెని పునర్నవి ఓదార్చింది. తర్వాత కూడా జ్యోతి, రవిలు ఏడుస్తూనే ఉన్నారు. దీంతో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. ‘ఆపండెహే ఇది సంతాప సభ కాదు.. ఆడు (అలీ) చచ్చిపోలేదు. ఏడుస్తూ కూర్చోడానికి రెండు పీకుతా మిమ్మల్ని ఇద్దర్నీ.. మామూలుగా కొట్టను అని వారించడంతో కాస్త కంట్రోల్ అయ్యారు శివజ్యోతి, రవిలు.

ఆ తర్వాత బిగ్ బాస్ శివజ్యోతి, హిమజలకు ఓ సరదా టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగా శివ‌జ్యోతి, హిమ‌జలు ఫోన్ ప‌ట్టుకొని ఇల్లు మొత్తం తిరుగుతూ ఇంటి స‌భ్యుల మూమెంట్స్‌ని త‌మ కెమెరాలో బంధించారు. దీని తర్వాత బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియని మొదలుపెట్టారు. ఈవారం ఎలిమినేషన్‌లో భాగంగా హౌస్‌లో ఉన్న 11 మందిని రెండు గ్రూపులుగా విడగొట్టారు. అయితే హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న బాబా భాస్కర్‌కి మినహాయింపు ఇచ్చారు. గ్రూప్ 1లో రాహుల్, వరుణ్, వితికా, శిల్ప, పునర్నవిలు ఉండగా.. గ్రూప్‌ 2లో రవి, శివజ్యోతి, శ్రీముఖి, మహేష్, హిమజలు ఉన్నారు. ఒక్కో గ్రూప్‌ వాళ్లు.. తమ ఆపోజిట్ గ్రూప్‌లో ఉన్న ఇద్దరి ఫొటోలను తీసుకుని మంటల్లో కాల్చి నామినేట్ చేయడానికి సరైన రీజన్ చెప్పాలని టాస్క్ ఇచ్చారు.

దీంతో ముందుగా రంగంలోకి దిగిన ర‌వికృష్ణ .. రాహుల్, శిల్పల‌ని నామినేట్ చేశాడు. ఆ త‌ర్వాత పునర్నవి.. (మహేష్, శ్రీముఖి), శివజ్యోతి.. (పునర్నవి, శిల్ప), శిల్ప చక్రవర్తి.. (జ్యోతి, హిమజ), శ్రీముఖి.. (పునర్నవి, శిల్ప), వితిక.. (రవి, రాహుల్), హిమజ.. (శిల్ప, వితిక), వరుణ్.. (మహేష్, హిమజ), మహేష్.. (పునర్నవి, వరుణ్ సందేశ్), రాహుల్.. (శ్రీముఖి, రవి)లని నామినేట్ చేశాడు.

ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో ఎక్కువ మంది శిల్ప చక్రవర్తి, పునర్నవి, మహేష్, హిమజ, రవి, శ్రీముఖిలను నామినేట్ చేయడంతో ఈ ఆరుగురు నామినేట్ అయ్యారు. హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న బాబా భాస్కర్‌కి ప్రత్యేక అధికారం ఇచ్చారు. నామినేషన్‌లో ఉన్న శిల్ప చక్రవర్తి, పునర్నవి, మహేష్, హిమజ, రవి, శ్రీముఖి ఆరుగురిలో ఒకర్ని సేవ్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించడంతో బాబా భాస్కర్ రవిని సేవ్ చేశారు.

 

Leave a Reply