మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికలు.. కర్ణాటకలో అనర్హత ఎమ్మెల్యేలకు షాక్..

Elections in Maharashtra and Haryana to be held on Oct 21, counting of votes on Oct 24
Share Icons:

ఢిల్లీ: గత ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇక ఆ ఎన్నికల తర్వాత ఎన్నికల సంఘం మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు…18 రాష్ట్రాల్లో ఖాళీ అయిన 64 స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి.

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం అదే సమయంలో 64 స్థానాల్లో ఉప ఎన్నికల నిర్వహణకు సిద్దం అయింది. అరుణాచల్‌ ప్రదేశ్‌, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, అసోం, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, మేఘాలయ, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్‌, రాజస్తాన్‌, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లోని పలు స్థానాలకు అక్టోబరు 21న ఉప ఎన్నికలు జరుగుతాయని, అదే నెల 24న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు.

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 27న నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబరు 2న హర్యానా అసెంబ్లీ గడువు, మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబరు 9న ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుంది.. హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు, మహారాష్ట్రలోని 288 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 21న ఎన్నికలు.. అక్టోబర్ 24న ఫలితాలు వెల్లడికానున్నాయి.

కర్ణాటకలో రెబల్ ఎమ్మెల్యేలకు షాక్

గత ఆగష్టులో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మీద తిరగుబాటు చేసి17 మంది రెబల్ ఎమ్మెల్యేల వారి పదవులకు రాజీనామా చేయడంతో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ 17మంది మీద స్పీకర్ అనర్హత వేటు వేయడంతో…15 నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించడానికి భారత్ ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు చోట్ల మాత్రం ఉప ఎన్నికలు జరగడం లేదు. రెండు నియోజక వర్గాల విషయం కోర్టులో విచారణ జరుగుతుండటంతో మిగిలిన 15 శాసన సభ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహిస్తామని శనివారం ఎన్నికల కమిషన్ తెలిపింది. సెప్టెంబర్ 30వ తేదీ నామినేషన్లు సమర్పించడానికి చివరి తేది. అక్టోబర్ 21వ తేదీ పోలింగ్ జరుగుతుంది, అక్టోబర్ 24వ తేదీ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.

ఇక, తెలంగాణలోని హుజూర నగర్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నికకు సైతం షెడ్యూల్ ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ ఎంపీగా గెలవడంతో …ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. అక్కడ ఇప్పుడు టీఆర్ఎస్ నుండి గత ఎన్నికల్లో పోటీ చేసిన సైదిరెడ్డి తో పాటుగా శంకరమ్మ పోటీకి ఆసక్తి చూపుతున్నారు. అదే విధంగా కాంగ్రెస్ నుండి సైతం ఇదే సీటు కోసం పోటీ నెలకొని ఉంది. ఉత్తమ్ సతీమణి పద్మావతికి మద్దతుగా సీనియర్ నేతలు జానారెడ్డి..కోమటిరెడ్డి నిలిచారు. కాగా.. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారికి వద్దని..కొత్త వారికి అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి లాంటి నేతలు కోరుతున్నారు.

Leave a Reply