రాయచోటిలో వార్ వన్ సైడే…

Share Icons:

కడప, 22 మార్చి:

కడప జిల్లా రాయచోటిలో ఇప్పటివరకు జరిగిన అన్నీ ఎన్నికల్లో అభ్యర్ధుల మధ్య టఫ్ ఫైట్ జరిగేది. అటు ఇటూగా 16 వేలకు మించి మెజార్టీ రాలేదు. అయితే 2012 ఉప ఎన్నికలు, 2014 ఎన్నికలు మాత్రమే ఒక పార్టీకి పూర్తి స్థాయి అనుకూల వాతారణంలో జరిగాయని చెప్పవచ్చు. వాయికాపా తరుపున శ్రీకాంత్ బరిలో ఉండటమే ఇది సాధ్యమైంది. ఈ సారి ఎన్నికల్లో కూడా ఆయనే బరిలో ఉన్నారు. ఇక గత ఎన్నికల్లో తెదేపా నుంచి పోటీ చేసి ఓడిపోయిన  ఆర్ రమేశ్ రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు.

రాయచోటిలో శ్రీకాంత్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది, వైకాపా బలంగా ఉండటంతో ఈసారి కూడా ఇక్కడ శ్రీకాంత్ గెలుస్తారని గట్టి నమ్మకంతో ఉన్నారు. అటు శ్రీకాంత్‌ని ఓడించేందుకు రమేశ్ బాగానే కష్టపడుతున్నారు. పైగా రాయచోటి నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ, ఎస్సీ, రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు వైసీపీకి అండగా ఉన్నారు. అభ్యర్థితో సంబంధం లేకుండా ఈ ఓట్లు వైసీపీకి పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అయితే తెలుగుదేశం పార్టీకి సాంప్రదాయకంగా బీసీ వర్గాలు మద్దతు తెలుపుతున్నాయి. నియోజకవర్గంలో వడ్డెర, యాదవ, కురభ, నాయిబ్రాహ్మణ, రజక వర్గాలతో పాటు బలిజ వర్గం కూడా ఎక్కువుగా టీడీపీ వైపు ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీకి మాజీ ఎంపీ, ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత నియోజకవర్గ అభ్యర్ధి రమేష్‌రెడ్డి మధ్య పొసగకపోవడం ప్రధాన లోపంగా చెప్పవచ్చు. ఈ కారణంతోనే వైసీపీ గెలుపుపై ధీమాగా ఉంది. జనసేన నుంచి ఎస్‌కే.హసన్‌ బాషా పోటీ చేయనున్నారు. కానీ ఇక్కడ వైసీపీదే ఆధిపత్యం.

మామాట: ఇక్కడ వైకాపాని ఢీకొనడం తెదేపాకి కష్టమే.

Leave a Reply