ఎన్నికల వేళ భారీగా నగదు పట్టివేత… టాప్‌లో ఏపీ

Share Icons:

తిరుపతి, ఏప్రిల్ 05,

సార్వత్రిక ఎన్నికల వేళ  దేశవ్యాప్తంగా భారీగా నగదు, మద్యం ఏరులై పారుతోంది. దీంతో దాడులు చేసిన ఎన్నికల అధికారులు ఇప్పటివరకు రూ. 377.51 కోట్లు నగదు సీజ్ చేశారని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దీంతో పాటు రూ. 157 కోట్ల విలువైన మద్యం, రూ. 705 కోట్ల విలువైన మత్తు పదార్థాలు, రూ. 312 కోట్ల విలువైన బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే అధికారులు సీజ్ చేసిన మొత్తంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోనే అత్యధికమని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో దేశవ్యాప్తంగా జోరుగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు.

ఎవరైనా రూ. 50 వేలకు మించి నగదు తీసుకు వెళుతుంటే, ఆ డబ్బుకు సంబంధించిన సరైన పత్రాలను తమతో పాటు  ఉంచుకోవాలనీ చెబుతున్నారు. సరైన డాక్యుమెంట్స్ లేకుంటే, ఆ డబ్బును ఐటీ శాఖకు అప్పగించక తప్పదని ఈసీ హెచ్చరించింది. ఆభరణాలు తీసుకెళుతున్నా, వాటికి సంబంధించిన రశీదులు తప్పనిసరిగా తీసుకెళ్లాలని చెబుతున్నారు. కొద్ది రోజుల్లో పోలింగ్ జరగాల్సి ఉన్న ఏపీలో అక్రమంగా తరలిస్తున్న నగదుతో పాటు…   మద్యాన్ని,  కోట్లాది రూపాయల విలువైన వస్తువులను పట్టుకున్నవిషయం తెలిసిందే.

మామాట:  ఓట్లంటే.. ప్రలోభాలే కదా కనిపించేది..

Leave a Reply