ఇక మీదట రెండు స్థానాల్లో పోటీ చేయడం కుదరదు?

Share Icons:

ఢిల్లీ, 4 ఏప్రిల్:

రాజకీయ నాయకులకు భారత ఎన్నికల సంఘం పెద్ద షాక్ ఇచ్చింది. ఇక మీదట ఒక్కో అభ్యర్థి ఒక్క స్థానం కోసం మాత్రమే పోటీచేయాలన్న ప్రతిపాదనలకు మద్దతు ఇస్తున్నట్టు సుప్రీంకోర్టుకు నివేదించింది.

అయితే ఇదివరకు ఏ అభర్ధి అయిన ఓటమి భయంతో ఒకేసారి ఏదైనా రెండు లోక్‌సభ లేదా శాసనసభ స్థానాలకి పోటీ చేసేవారు.

ఒకవేళ రెండు చోట్ల ఓడిపోయిన, లేదా ఒక చోట ఓడిపోయి, మరో చోట గెలిచిన పెద్ద సమస్య ఉండదు. కానీ రెండు చోట్ల గెలిస్తే ఒకచోట రాజీనామా చేస్తే మళ్ళీ దానికి ఎన్నికలు నిర్వహిస్తారు.  దీని వలన సమయం, ధనం ఎక్కువ వృధా అవుతాయి.

ఈ నేపథ్యంలో ఒక స్థానం కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకుండా పరిమితం చేయాలంటూ ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) సుప్రీం కోర్టులో దాఖలు అయ్యింది.

ఇక దీనికి సమాధానంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రతిపాదనలకు మద్దతు ఇస్తున్నట్టు సుప్రీంకోర్టుకు నివేదించింది. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు ఓ నియోజక వర్గాన్ని వదిలి మరో స్థానానికి వెళ్లడం ఓటర్లకు అన్యాయం చేయడమేనని ఈసీ వ్యాఖ్యానించింది. కాబట్టి ఓటమి భయం ఉన్న రాజకీయ నాయకులకి ఇది చెడ్డవార్తే.

మామాట: ఇది త్వరగా అమలైతే బాగుంటుందేమో..

English summary:

The Election Commission has supported a PIL in the Supreme Court that seeks a restraint on candidates against contesting from more than one seat.

Under the existing legal regime, a candidate is allowed to contest from up to a maximum of two constituencies in Lok Sabha and Legislative Assembly polls.

One Comment on “ఇక మీదట రెండు స్థానాల్లో పోటీ చేయడం కుదరదు?”

Leave a Reply