TRENDING NOW

ఏపీ ఓటర్ల తుది జాబితా వచ్చేసింది…

ఏపీ ఓటర్ల తుది జాబితా వచ్చేసింది…

విజయవాడ, 12 జనవరి:

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్యకు సంబంధించిన తుది జాబితాని ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా 3, 69, 33, 091 మంది ఓటర్లు ఉన్నట్టు ఈసీ ప్రకటించింది. ఇక ఇందులో 1, 83, 24, 588 మంది పురుషులు కాగా, 1,86, 04, 742 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కన రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉండడం విశేషం.

అలాగే జిల్లాలవారీగా చూస్తే ఓటర్ల జాబితాలో తూర్పుగోదావరి జిల్లా టాప్‌లో నిలవగా..విజయనగరం జిల్లా చివరన నిలిచింది. మొత్తంగా తూర్పుగోదావరి జిల్లాలో 40, 13, 770 మంది ఓటర్లు ఉండగా.. విజయనగరం జిల్లాలో 17,33,667 ఓటర్లు ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 3, 761 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నట్టు తేల్చింది.

treefurn AD
Life Homepathy

మామాట: మొత్తానికి ఓ లెక్క తేలింది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: