ఈ 27 అర్థరాత్రి వరకు ఎన్నికల కోడ్‌ అమలు 

Share Icons:

అమరావతి, మే21,

ఈ నెల 27 అర్థరాత్రి వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని సీఈఓ ద్వివేది స్పష్టం చేశారు. తప్పనిసరి పరిస్థితిలో కౌంటింగ్‌ పూర్తయిన తర్వాత కూడా రీపోలింగ్‌ నిర్వహించే అవకాశాలున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫలితం ఎటూ తేలకపోతే ఈసికి విచక్షణాధికారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఏవైనా ఈవిఎంలు మొరాయించి వివి ప్యాట్‌ లెక్కలో తేడా వస్తే మిగతా లెక్కింపులో పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం అతి తక్కువగా ఉంటే రీపోలింగ్‌కు ఆదేశించే అవకాశాలుంటాయని సీఈఓ ద్వివేది తెలిపారు.

మామాట- ఓ తల నొప్పి వదిలిందిగా.. 

Leave a Reply