ఎల్.రమణ హౌస్ అరెస్ట్..

Share Icons:

హైదరాబాద్, 12 జనవరి:

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణను హైదరాబాద్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

ఈ రోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగు రైతు అధ్యక్షుడు వంటేరు ప్రతాప్ రెడ్డి అరెస్ట్‌కి నిరసనగా ర్యాలీ చేపట్టారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి సీఎం క్యాంప్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీకి టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పిలుపునిచ్చారు.

వంటేరుపై అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దీంతో, ఈ ర్యాలీని భగ్నం చేసే క్రమంలో టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

అందులో టీటిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ, పెద్దిరెడ్డి, కే‌పి‌హెచ్‌బి‌ నేత మందాడి శ్రీనివాసరావుని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని, నిరంకుశంగా వ్యవహరిస్తూ ప్రజా హక్కులను హరించి వేస్తుందని టిటిడిపి నేతలు ధ్వజమెత్తారు.

మామాట: ప్రతిపక్షాలకి ఇవి షరా మామూలే..

English summary: Telangana TDP president L.Ramana was house arrested by the Hyderabad police. TTDP Call for Rally from NTR Trust Bhavan to CM camp Office to protest against the arrest of vanteru prathap reddy.

Leave a Reply