చదువు వేరు విద్యార్హత వేరు

Share Icons:

హైదరాబాద్, ఆగష్టు 11,

ప్రజాప్రతినిధుల చదువు సంధ్యలపై సర్వోన్నత న్యాయస్థానం విలక్షణ తీర్పు ప్రకటించింది.  ఏమైందంటే.. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల అఫిడవిట్ లో విద్యార్హతలను తప్పుగా పేర్కొన్నారంటూ కంచర్ల భూపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది.  పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తి కురియన్ జోసెఫ్, న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ ల ధర్మాసనం చదువుకు, విద్యార్హతకు గల తేడాను స్పష్టంగా తెలియజేసింది.

భూపాల్ రెడ్డి తరపు న్యాయవాది  కేసులో తన వాదన వినిపిస్తూ… కోమటిరెడ్డి తన విద్యార్హతను తప్పుగా పేర్కొన్నారని చెప్పారు. ఆయన బీఈ చదివినట్టు పత్రికల్లో కూడా వచ్చిందని తెలిపారు. ఒక్క సబ్జెక్టు కూడా పాస్ కానివారు…. బీఈ చదివినట్టు చెప్పుకోవడం సరికాదని అన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ… అఫిడవిట్ లో ఏం చదివారు? అని మాత్రమే ఉందని, విద్యార్హత ఏమిటని లేదుకదా? అని ప్రశ్నించింది. కోమటిరెడ్డి తన అఫిడవిట్ లో పేర్కొన్నది కరెక్టేనని… ఆయన బీఈ చదివారని, కానీ ఉత్తీర్ణత సాధించలేదని స్పష్టం చేస్తూ, పిటిషన్ ను కొట్టివేసింది.

మామాట : సో, పాస్ -ఫెయిల్ మధ్య ఎంత తేడా ఉందో గుర్తించారా …

 

e

Leave a Reply