అమెరికాని వణికిస్తున్న వరుస భూకంపాలు..

Share Icons:

అలస్కా, 1 డిసెంబర్:

అగ్రరాజ్యం అమెరికాని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. శుక్రవారం ఉదయం అలస్కాలో వరుసగా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మొదటి భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ 7గా రికార్డ్ అయ్యింది.

ఇక అలస్కాలోని యాంకరేజ్ సిటీకి 11 కిలోమీటర్ల దూరంలో భూమికి 21 మైళ్లలోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అలాగే మొదటి భూకంపం వచ్చిన కొద్ద నిమిషాల్లోనే… మరో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.7గా నమోదయ్యింది.

అయితే ఈ వరుస భూకంప ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయిన ఆస్తినష్టం మాత్రం భారీగా జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ భూకంప తీవ్రతకు చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. రోడ్లు కుంగిపోయాయి. ఇక ఎంత నష్టం సంభవించింది? అన్నదానిపై అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే భూకంపాలా ఎఫెక్ట్‌తో ఆందోళన చెందిన అధికారులు మొదట సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసిన మళ్లీ కాసేపటికే వాటిని ఉపసంహరించుకున్నారు.

మామాట: ఈ భూ ప్రకంపనలు ఇంతటితో ఆగేనా…

Leave a Reply