ఫుల్‌గా తాగి భర్తను దారుణంగా చంపిన భార్య…!

Share Icons:

కరీంనగర్‌, 20 మార్చి:

వివాహబంధం అంటే కలకాలం భార్యభర్తలు కలిసి మెలిసి ఉండాలని పెద్దలు దీవించి పంపుతారు. అనాధిగా వస్తున్న వివాహబంధానికి ఎంతో గౌరవం ఉంటుంది. కానీ ఈ మద్య భార్య, భర్తలు తమ కాపురాల్లో చిచ్చులు పెట్టుకోవడమే కాదు..అన్యాయంగా ఒకరినొకరు చంపుకుంటున్నారు. తాజాగా మద్యం సేవించిన మహిళ ఆ మత్తులో భర్తను హత్య చేసింది. ఈ సంఘటన కరీంనగర్‌లోని బేడ బుడగ జంగాల కాలనీలో మంగళవారం తెల్లవారు జామున జరిగింది.

కరీంనగర్‌లోని బేడ బుడగజంగాల కాలనీలో సిరిగి మల్లయ్య (60) భార్య ఎల్లవ్వతో కలిసి నివాసం ఉంటున్నాడు. పాత ఇనుప సామగ్రి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు. వీరికి ఐదుగురు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. రోజులాగానే మల్లయ్య పనికి వెళ్లి రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఎల్లవ్వకు కూడా మద్యం సేవించే అలవాటు ఉంది. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఈ స్థితిలోనే మద్య మత్తులో ఉన్న ఎల్లవ్వ వేకువజామున బండరాళ్లతో మోది భర్తను హత్య చేసింది. అయితే రక్తం మరకలు అంటిన చీరను కాల్చి వేసి..తన భర్త బాగా తాగి కిందపడిపోయి చనిపోయాడని స్థానికులను నమ్మించే ప్రయత్నం చేసింది. స్థానికులు వచ్చి చూడడంతో విషయం బయటపడింది. వెంటనే స్తానికులు సమాచారంతో టౌన్ సిఐ ప్రకాష్, ఎస్ఐ ప్రసాద్ తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్తలాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యులు విచారించారు. ఎల్లవ్వ మతిస్థిమితం కోల్పోయిందని తెలిసింది. మద్యం మత్తులోనే ఎల్లవ్వ భర్తను చంపేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మామాట: మహిళా లోకం పరిగెత్తుతుందిగా…

English Summary: mallaiah and his wife ellavva were living in karimnagar. This couple had 5 son’s and 1 daughter. Couple used to small disputes between them. When ellavva consumed alcohol she murdered mallaiah with stones.

One Comment on “ఫుల్‌గా తాగి భర్తను దారుణంగా చంపిన భార్య…!”

Leave a Reply