ఇక రిజిస్ట్రేషన్ తప్పని సరి

Share Icons:

 

కొత్త ఢిల్లీ, ఆగస్టు 28,

వచ్చే డిసెంబర్ 1 వ తేదీ తరువాత డ్రోన్ లు, చిన్న బొమ్మ విమానాలు,  వాటి ఆపరేటర్ వివరాలను తప్పనిసరిగా అధికారుల వద్ద రిజిస్టర్ చేయించాలని డిజిసిఏ ఉత్తర్వులు జారీ చేసింది. కింది నుంచీ నడిపే బొమ్మ విమానాలు, డ్రోన్ లను  ఫోటో గ్రఫీ, భూ సర్వే, వ్యవసాయ వినియోగం, వంటి వాటిలో నియంత్రణ మేరకు నిబంధనలకు లోబడి వినియోగానికి అనుమతిస్తారని పౌర విమానయాన శాఖ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

కాగా, వస్తువుల చేరవేతకు డ్రోన్ ల వినియోగాన్ని అనుమతించరు. అయితే వరదలు, ఇతర ప్రమాద సమయాలలో బాధితులకు మందులు, ఆహారం అందించడానికి ఈ నిబంధనలలో సమయానుకూలంగా మినహాయింపులు పొందవచ్చును. ఇక కిందినుంచీ నడిపే రిమోట్లీ పైలెటెడ్ ఎయిర్ క్రఫ్ట్(RPA)లను  ఐదు రకాలుగా విభజించారు. నానో ( 250 గ్రాముల బరువు కంటే తక్కువ), మైక్రో (250 నుంచి 2 కిలోల బరవు), స్మాల్ (2 నుంచి 25 కిలోల బరువు), లార్జ్ (150 కిలోల కంటే అధిక బరువు ఉన్నవి) వాటి అనుమతికోసం ఆన్ లైన్లో ధరఖాస్తు చేసుకోవాలి, తద్వారా ప్రత్యేకమైన ఐడి నెంబర్, పర్మిట్ లైసెన్స్ పొందవచ్చు.

వివాహమహోత్సవాలు..

పెళ్లిఫోటోల కోసం డ్రోన్ల వినియోగం అనుమతిస్తారు కానీ, అవి 450 మీటర్ల పరిదిలో పగటి పూట మాత్రమే ఉపయోగించాలి. రాత్రిపూట మైక్రో డ్రోన్ వినియోగించ వచ్చు. బాగా వెలుతురుండే, నాలుగు గోడల మధ్యన ఈ డ్రోన్ వినియోగించేందుకు అనుమతి తీసుకోవలసి ఉంటుంది. స్మాల్, లార్జ్ డ్రోన్ లు 400 అడుగుల ఎత్త వరకు, నానో డ్రోన్ 50 అడుగుల వరకు, మైక్రో డ్రోన్ లు 200 అడుగుల ఎత్త వరకే ఎగరడానికి అనుమతిస్తారు.

నిషేదం..

విమానాశ్రయాలు, అంతర్జాతీయ సరిహద్దులు, తీరప్రాంతాలు, పార్లమెంట్, రాష్ట్ర సచివాలం సముదాయం, రక్షణ సంస్థలు, పరికరాలు, సున్నిత పర్యావరణ ప్రాంతాలలో డ్రోన్ ల వినియోగం నిషేధించారు. తమ వద్ద నమోదై, అనుమతి పొందిన డ్రోన్ వివరాలను పౌర విమాన యాన శాఖ సంబంధిత జిల్లా పోలీస్ అధికారులకు పంపుతుంది. అలాగో డ్రోన్ ను విమియోగించే వారు కూడా సమీప పోలీస్ స్టేషన్లో తెలియజేయాల్సి ఉంటుందని పౌరవిమానయాన శాఖ కార్యదర్శి పేర్కోన్నారు.

మామాట: సాంకేతికత అందుబాటులో ఉన్నా.. నియంత్రణ అవసరమే..

Leave a Reply