ఆ రోజు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే జైలే…

Share Icons:

హైదరాబాద్, 29 డిసెంబర్:

కొత్త సంవత్సరానికి ముందు అంటే డిసెంబర్ 31న బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజల హక్కులకు ఆటంకం కలిగించినైట్లెతే అలాంటి వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తామని హైదరాబాద్ పోలీస్ శాఖ తెలిపింది. ముఖ్యంగా 18 నుంచి 30 ఏళ్ల వయస్సు ఉన్న యువత డిసెంబర్ 31న అర్ధరాత్రి అతిగా మద్యం సేవించి రోడ్లపై హంగామా చేయరాదని, ఒకవేళ అలా చేస్తే అరెస్ట్ చేస్తామన్నారు. అదేవిధంగా డిసెంబర్ 31న అర్ధరాత్రి 1 గంట వరకే బార్లకు అనుమతి ఉంటుందని, ఎవరైన మద్యం వ్యాపారులు నిబంధనలను అతిక్రమించి మద్యం అమ్మకాలు జరిపితే…. సదరు బార్ల లైసెన్స్ పూర్తిగా రద్దు చేస్తామని హెచ్చరించారు.

కాగా… ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న 200 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. అదే విధంగా రిసార్టులు, క్లబ్‌లు, ఫాం హౌస్‌లు ఇతర ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతామన్నారు. డిసెంబర్ 31 వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు.

మామాట: కాబట్టి యువత జాగ్రత్తగా ఉండండి…

 

Leave a Reply