నిన్ను చంపేస్తా…జగన్ కి చెబుతావా చెప్పుకో..జగన్ నన్నేమీ: వైసీపీ ఎమ్మెల్యే బెదిరించారు

Share Icons:

నెల్లూరు:

 

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనని చంపేస్తానని బెదిరించారని జమీన్ రైతు’ వారపత్రిక అధినేత డోలేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ప్రసాద్ ఇంటిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరులు దాడి చేసినట్లు ఆరోపణలు వెలువడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డోలేంద్ర ప్రసాద్ ను మీడియాతో మాట్లాడుతూ, కోటంరెడ్డి, ఆయన అనుచరుల తన ఇంటికి వచ్చారని చెప్పారు. కోటంరెడ్డికి చెందిన మనుషులు పది మంది తమ ఇంట్లోకి వచ్చి అసభ్యంగా మాట్లాడారని ఆరోపించారు.

 

కోటంరెడ్డి సహా ఆయన అనుచరులు తనపై చేయి చేసుకున్నారని ఆరోపించారు. ‘‘జమీన్ రైతు’ లో నన్ను అరాచక శక్తి అని చెప్పి రాశారు.. నిన్ను ఇప్పుడు చంపేసి పోతాను, పొడిచేసి పోతాను, ఈసారి, మూడు పేజీలు రాసుకో’ అని బెదిరించారు’ అని డోలేంద్ర ప్రసాద్ ఆరోపించారు.

 

కోటంరెడ్డి తమ ఇంట్లో నుంచి వెళ్లిపోతూ ‘నిన్ను చంపేస్తాను’ అని బెదిరించడమే కాకుండా, పోలీసులకు చెప్పుకుంటావో, ఎస్పీకి చెప్పుకుంటావో లేకపోతే జగన్ కు చెబుతావో చెప్పుకో అని అన్నారని ఆరోపించారు. ‘జగన్ కు పోయి చెప్పుకో..జగన్ నన్నేమీ ..’ అంటూ వెళ్లిపోయారని ఆరోపించారు.

 

Leave a Reply