టీడీపీకి డొక్కా గుడ్‌బై…ఓడిపోతానని తెలిసే ఆ సీటు ఇచ్చారు…

tdp mlc dokka manikya varaprasad fires on cm jagan
Share Icons:

గుంటూరు: టీడీపీకి ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ రాజీనామా చేశారు. ఇటీవలే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. అధిష్ఠానం వైఖరితో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన కార్యకర్తలకు, అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. టీడీపీ అధిష్టాన వైఖరి తీవ్ర ఆవేదనకు గురిచేసిందని లేఖలో పేర్కొన్నారు. రాజధాని రైతుల జేఏసీ పేరుతో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. టీడీపీ నేతల చౌకబారు విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. 2019 ఎన్నికల్లో తాను తాడికొండ సీటును ఆశించానని.. కానీ ఓడిపోతానని తెలిసినా ప్రత్తిపాడు సీటు ఇచ్చారని ఆరోపించారు. ఎన్నికల తర్వాత కూడా టీడీపీ అధిష్టానం తీరు తనను మానసికంగా కలచివేసిందన్నారు.

ఇదిలా ఉంటే చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. ఇప్పటికే చంద్రబాబు స్థానిక సంస్థల్లో       చేతులెత్తేశారంటూ ట్వీట్ చేశారు. ‘రెండేళ్ల క్రితం జరగాల్సిన స్థానిక ఎన్నికలకు అడ్డంకులు సృష్టించింది చాలక ఇంత హడావుడి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మద్యం, డబ్బు పంపిణీ లేక పోతే మేం పోటీ చేసేది లేదని ఇప్పటికే చేతులెత్తేశారు. దివాళాకోరు రాజకీయాలెందుకు బాబూ. నీవల్ల కాదు గానీ కుల మేధావి కిరసనాయిలు సలహా ప్రకారం నడుచుకో’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

కాగా మరో ట్వీట్‌లో ‘యస్‌ బ్యాంక్‌ పైన చంద్రబాబు అంత ప్రేమ కనబర్చారంటేనే అవతవకలు జరిగినట్టు ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ పై దర్యాప్తు జరుగుతోంది. దేశంలో ఎక్కడ హవాలా, లాండరింగ్ బయటపడ్డా బాబు పేరు వినిపిస్తోంది’ అంటూ విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.

 

Leave a Reply