TRENDING NOW

జీతాలు ఎక్కువ పెంచారంటూ ఆందోళన చేసిన డాక్టర్లు

జీతాలు ఎక్కువ పెంచారంటూ ఆందోళన చేసిన డాక్టర్లు
views:
21

అటావా, మార్చి 13 :

తమ జీతాలు ఎక్కువగా పెంచారంటూ కెనడాలోని డాక్టర్లు ఆందోళనకు దిగారు.  అదేంటి జీతం పెంచితే ఆందోళన చేయడం ఏంటి అనుకుంటున్నారా..? ఎవరైనా జీతాలు పెంచామని నిరసన చేపడతారు. కానీ కెనడాలోని డాక్టర్లు దానికి విరుద్ధంగా తమకు ఎక్కువ జీతాలు వద్దు అంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 700 మందికిపైగా డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ఈ మేరకు ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖ రాశారు.

ఆ డబ్బులని నర్సులపై పడుతున్న పనిభారానికి, రోగుల అవసరాలను తీర్చడానికి వినియోగించాలని లేఖలో డిమాండ్‌ చేశారు. ఇటీవల కెనడాలో మెడికల్ ఫెడరేషన్ క్యూబెక్‌ వైద్యులు జీతాలు పెంచగా దాన్ని వారు వ్యతిరేకించారు.

ఆ వైద్యులలో 213 జనరల్‌ ప్రాక్టీషనర్స్‌, 184 స్పెషలిస్టులు, 149 రెసిడెంట్‌ మెడికల్‌ డాక్టర్లు, 162 మంది మెడికల్‌ విద్యార్థులు ఉండగా, వారంతా  పెరిగిన తమ జీతాలను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. నర్సులు, రోగులు బాధలు పడుతున్నపుడు తమకు జీతాల పెంపు ఎందుకంటూ ప్రశ్నించారు.

పనిభారంతో నర్సులు బాగా అలసిపోతున్నారని, అలాగే  ఒకోసారి ఓవర్ టైం కూడా చేయాల్సి వస్తోందని వారు తమ లేఖలో పేర్కొన్నారు. ఇక సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేక రోగులు సతమతమవుతున్నారని కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో పెరిగిన తమ జీతాలను రద్దు చేసి, వాటిని ప్రజలకు మెరుగైన వైద్య సేవలకు వినియోగించాలని ఆ డాక్టర్లు ప్రభుత్వాన్ని కోరారు.

మామాట: మంచి పని చేశారు..

English summary:

While thousands of workers around the world protest for higher wages, more than 700 doctors in Canada are protesting their own pay raises.

(Visited 18 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: