ఇదోరకం లూటీ.. బ్యాంకుల తీరును సమర్థిస్తారా?

Meemaata lo maamaata Poll No 25
Share Icons:

 

 

అపుడు… అంటే చాలా సంవత్సరాల క్రితం మన దేశంలో బ్యాంకులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయనీ, సామాన్యులకు అందుబాటులో లేవని భావించిన కేంద్ర ప్రభుత్వం ఒక్క సారే 14 బ్యాంకులను ప్రైవేటు యాజమాన్యాలనుండి తీసేసుకుని, జాతీయం చేసింది. అప్పటి నుంచి ప్రభత్వ రంగ బ్యాంకులు కులాసాగా, విధులు నిర్వహిస్తూ,  యువతకు బ్యాంకు ఉద్యోగం ఉంటే  చాలు, అంతకు మించి ఏమీ అడక్కుండా వివాహం జరిగిపోయే దశకు చేరుకున్నాయి. బ్యాంకుల గ్లామర్ అలా ఉండేది. ప్రభుత్వ బ్యాంకులు కదా, రాజకీయాలలో తేలియాడి, చెంచాలకు వేల కోట్లు ఉదారంగా అప్పులిచ్చి, అవి వసూలు కాక, దివాలా తీసే దశకూ చేరుకున్నాయి. 

[pinpoll id=”59756″]

తిరుపతి, ఆగష్టు 06,

వర్తమానంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు వాటి ఏర్పాటు నాటి ఆశయాల సాధనలో విఫలమైనట్లేనని పలువురు భావిస్తున్నారు. అయినా బ్యాంకులు పేద, మధ్యతరగతి ఖాతాదారులకు చుక్కలు చూపిస్తూనే ఉన్నాయి. బడా నేతలకు, వారి అనుంగు పెట్టుబడి దారులకు జామీను కూడా అడగకుండా వేలాది కోట్లు అప్పనంగా అప్పగిస్తున్న బ్యాంకులు పేదల దగ్గర మాత్రం సవాలక్ష అడ్డంకులు విధించి, అనేక పత్రాలను పరిశీలించి, పరిశీలించి, రుణం మంజూరు చేయడానికి ముప్పుతిప్పలు పెడుతుంటాయి. ఇంత చేస్తున్నా, వాటి నిరర్థక ఆస్తుల చిట్టా ఏటికేడాది కొండవీటి చాంతాడంత పెద్దగా పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా నోట్ల రద్దు తరువాత బ్యాంకుల్లో పేదవారికి, మధ్యతరగతి వంటి సాధారణ ఖాతా దారులకు పరిస్థితి దారుణంగా తయారయింది.  బ్యాంకులు వారి పట్ల కనీస మర్యాదకూడా చూపడం లేదు. కేంద్రం ఒకవైపు డిజిటల్ లావాదేవీలు పెంపొందించాలనే నినాదంతో వ్యవహరిస్తుండగా, బ్యాంకులు అందుకు విరుద్దంగా బలహీణ, బక్కప్రాణులను బలితీసుకునే రీతిలో విధానాలు అమలు చేస్తూ, సామాన్యులు బ్యాంకులకు రాకుండా కేవలం నగదు లావాదేవీలవైపు మొగ్గు చూపేలా వీర ప్రతాపం చూపుతున్నాయి. తాజాగా పార్లమెంటు సాక్షిగా కేంద్రం ప్రకటించిన ఈ గణాంకాలు చూడండి బ్యాంకుల వ్యవహార శైలి మీకే తెలుస్తుంది.

గత నాలుగు సంవత్సరాల్లో 24 ప్రభుత్వ-ప్రైవేటు బ్యాంకులు తమ ఖాతాదారులు అకౌంటులో కనీస బ్యాలెన్స్ కొనసాగించలేదంటూ రూ. 11,500 కోట్లలను కొల్లగొట్టాయి. శుక్రవారం లోక్సభలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో (2017-18) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ఈ విధంగా రూ. 2,400 కోట్లు సేకరించింది. హెచ్‌డీఎఫ్ సీ బ్యాంకు రూ.590.84 కోట్లు, యాక్సిస్‌ బ్యాంక్‌ రూ.530.12 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.317.6 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేశాయి.

జూలై 1, 2015 నాటి ‘బ్యాంకుల్లోని కస్టమర్ సర్వీసెస్’ పై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాస్టర్ సర్క్యులర్ ద్వారా   వివిధ సేవలపై పన్నులు వసూలు చేయటానికి బ్యాంకులు అనుమతించబడతాయి.  దీని ప్రకారం, వివిధ బ్యాంకులు కనీస అకౌంట్ బ్యాలెన్స్ విధానాన్ని ఉచితంగా నిర్వహించడం లేదు.

ఉదాహరణకు, ఎస్బిఐ ఖాతా నిర్వహణ లోపాలకు సంబంధించి రూ. 5 నుండి రూ. 15 (దీనికి జిఎస్టి అదనం) ల మధ్య సేవారుసుం వసూలు చేస్తుంది. మెట్రో నగరాలలో సేవిగ్ ఖాతాలో కనీస నిల్వ రూ. 3 వేలు, పట్టణాలలో రూ.2 వేలు, గ్రామప్రాంతాలలో రూ. వేయి ఉండేలా చూసుకోవాలి.

అదేవిధంగా, హెచ్డిఎఫ్సీ బ్యాంక్ వినియోగదారులు మెట్రో నగరాలలో రూ. 10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 5వేలు, గ్రామీణ ప్రాంతాలలో ఉన్నవారికి రూ. 2,500 నిర్వహించాలి. అలా నిర్వహించనివారికి మెట్రో / పట్టణ మరియు అర్బన్-అర్బన్ ప్రాంతాలలో రూ. 150 నుండి రూ.  600 (దీనికి జిఎస్టి అదనం) ల మధ్య జరిమానా విధించే వీలుంది, ఇది గ్రామీణ ప్రాంతాలలో రూ.270 నుండి రూ. 450 (దీనికి జిఎస్టి అదనం) మధ్య ఉంటుంది.

అన్ని వేల సేవింగ్ ఖాతాలలో ఈ లెక్కన ప్రజల సొమ్ము వడ్డీ లేకుండా, ఎంత మొత్తం ఉంటుందో ఊహించగలరా…. మరి అంత సొమ్ము మనది వాడుకుంటున్నందుకు బ్యాంకులు మనకేమైనా ప్రతిఫలం ఇస్తున్నాయా… ప్రతిదీ రుసుము చెల్లించే పొందుతున్నాం కదా. 

ప్రధాన మంత్రీ జన్ ధన్ యోజన కింద ఉన్న ప్రాథమిక పొదుపు ఖాతాలు కనీస బ్యాలెన్స్ నిర్వహణ నుండి మినహాయించబడ్డాయి. విజయ్ మాల్యా లాంటి ఎందరో కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అస్మదీయులు వేలాది కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు తిరిగిచెల్లించని పరిస్థితి, వారి నుంచీ పైసా కూడా   బ్యాంకులు తిరిగి రాబట్టుకోలేని నిస్సహాయత కొనసాగుతుండగా, ఇటు పేదల ఖాతాలో కనీస నిల్వ లేదనే కారణంతో వేల కోట్లను బ్యాంకులు అక్రమంగా తీసేసుకోవండం ఏ విధంగా శ్రేయోరాజ్యం విధానమవుతుందో.. పెద్ద పెద్ద అవినీతి తిమింగలాలను చూసీ చూడనట్టు విడిచిపెట్టేస్తున్న బ్యాంకులు పేదవారి నడ్డి విరవడంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి.

ఇంతకూ బ్యాంకులు ఉన్నది ఎందుకు. ధనవంతుల అక్రమాలకు వంతపాడి, తమ వంతు సాయం అందించడానికా,లేక పేదలు, సామాన్యులు, జలగల వంటి వడ్డీవ్యాపారుల బారిన పడుతున్న అభాగ్యులను ఆదుకోవడానికా, ప్రస్తుతం బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరు కందు వడ్డీ వ్యాపారుల నైజంతో పోల్చితే  ఏమంత మెరుగ్గాలేదు. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రజలకు బ్యాంకులపై నమ్మకం పోతుంది.

 

మామాట : బ్యాంకులు మళ్లీ సామాన్యుల నమ్మకం కూడగట్టుకోవాలి … అంతవరకూ నగదు కొరత ఇక్కట్టు తప్పవు.

Leave a Reply