నారావారి ఆస్తుల విలువ నమ్మేద్దామా..?

Share Icons:

తిరుపతి, నవంబర్ 22,

 

 రూపించి పలికి బొంకకు,

ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలో

గోపించురాజు గొల్వకు,

పాపపు దేశంబు సాఱకు పదిలము సుమతీ..! అంటాడు. అందులో తక్కినవి వద్దుగాని, మొదటి పాదానికి అర్థం మాత్రం తెలుసుకుందాం. రూపించి పలికి బొంకకు  అంటే.. సాక్షుల మూలముగా నిర్థారణ చేసి అబద్ధమును నిజమని స్థిరపరచుట.. వద్దని సుమతి శతక కారుడు చెప్పాడు.

[pinpoll id=”65532″]

కానీ, బుధవారం నారా లోకేష్ వారు ప్రకటించిన నారాజమానా ఆస్తుల విలువ ఇలా కాగితపు సాక్షాలతో తిమ్మిని బమ్మని చేయడానికి చేసిన ప్రయత్నంగా ఎవరికైనా తెలిసిపోతుంది. ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు గత కొన్ని సంవత్సరాలుగా క్రమం తప్పకుండా తన కుటుంబ ఆస్తులు ప్రకటిస్తున్నారు.  ఇందులో భాగంగా బుధవారం లోకేష్ ప్రకటించిన ఆస్తుల వివరాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని ఎవరైనా భావిస్తున్నారా.? మార్కెట్ విలువకు కాగితాలపై లోకేష్ చూపించిన విలువలకు పొంతన లేదనేది జనాభిప్రాయం. చంద్రబాబు నివాసం కోసం హైదరాబాద్ లో నిర్మించిన ఇంటి విలువ కేవలం రూ. 2.33 కోట్లట.. అది నమ్మదగినదిగా ఉందా..? రూ. పది కోట్లకు ఆ ఇంటిని కొనడానికి చాలా మంది సిద్దంగా ఉన్నారు.. ఇవ్వగలరా.. నారా సారూ..!

మామాట: ఈ కాకి లెక్కలను నమ్మడానికి ప్రజల చెవుల్లో క్యావేజీ పూలు ఉ…… !

Leave a Reply