ప్ర‌జ‌ల్ని త‌క్కువ అంచ‌నా వేయ‌ద్దు

Share Icons:

ప్ర‌జ‌ల్ని త‌క్కువ అంచ‌నా వేయ‌ద్దు

కేంద్ర ప్ర‌భుత్వమూ, ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం రెండూ ఎవ‌రి వాదనలు వారు పటిష్టంగా వినిపిస్తున్నారు “మంత్రుల రాజీనామాలతో”. వారుభయుల దృష్టి ప్రధానంగా రాజకీయప్రయోజనాలే. అంటే తుట్టతుదకు ఇంకా 21 వ శతాబ్దం 2018 లో కూడా ప్రజలు ఎదో అమాయకులు అనే భ్రమల్లో ప్రభుత్వాలుంటే పర్యవసానాలకి కూడా సిద్ధపడాలి. దేశ ఆర్ధిక విషయాల్లో ఇప్పుడు ప్రజలకి కావలసింది పూర్తి పారదర్శకత. ఎందుకంటే ప్రభుత్వాలు ఖర్చుపెడుతున్నది ప్రజలడబ్బే. ఇందులో గోపనీయతకూ అంకెలగారడీకి, కపటత్వానికి తావులేదు అని ప్రభుత్వాలు గమనించాలి. కాలంతోపాటూ మారాలి. లేకపోతే అధోపాతాళమే గతి. ప్రజల్ని తక్కువగా అంచనా వెయ్యకండి. చరిత్రలో దృష్టాంతరాలు చాలా విన్నాం. ఇప్పటికే బాగారక్తికట్టిన ఈ అంకానికి కారణం ప్రజల జ్ఞాపకశక్తి. రాష్ట్ర విభజనప్పుడు వారు దూరదర్శన్లో వీక్షించిన పార్లమెంటు కార్యకలాపాలు. మెలుకువ తెచ్చుకోవలసింది రాజాకీయ పార్టీలు. ఎప్పుడు మేలుకుంటారో?

ర‌ఘురాం మాగంటి

Raghuram comment on AP government

One Comment on “ప్ర‌జ‌ల్ని త‌క్కువ అంచ‌నా వేయ‌ద్దు”

Leave a Reply