TRENDING NOW

ఎవరికీ మద్దతు లేదు… !

ఎవరికీ మద్దతు లేదు… !

ముంబయి, మార్చి 14,

బాలీవుడ్‌ హీరో అమీర్‌ఖాన్‌ తన 54వ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని రాజకీయ ప్రాధాన్యం ఉన్న వ్యాఖ్యలు చేశారు. ఆయన తన పుట్టిన రోజును ఎప్పటిలాగే బంద్రాలోని తన నివాసంలో భార్య కిరణ్ రావ్, అభిమానులు, మీడియా సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో అందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తద్వారా ఎన్నికలను విజయవంతం చేయాలని కోరారు.

GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
Life Homepathy
treefurn AD

అంతేకాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల సమయంలో వారు ఇక్కడికి వచ్చి ఓటు వేయలేరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వారి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఈసీని కోరారు.

ఈ సందర్భంగా మీరు బిజెపి కి మద్దతు తెలుపుతారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు తాను ఏ పార్టీకి మద్దతు తెలపను అని అమీర్‌ఖాన్ సమాధానమిచ్చారు. అయితే ప్రజాస్వామ్యంలో ఓటు బలమైన ఆయుధమనీ, ప్రతి పౌరుడూ తప్పక ఓటు హక్కు వినియోగించుకోవాలనీ అమీర్ ఖాన్ విజ్ఞప్తిచేశారు.

మామాట: అంటే రాజకీయ రొచ్చుకు దూరంగా ఉంటారనమాట…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: