రెండో టీ20: భారత్ టార్గెట్ 159

Share Icons:

ఆక్లాండ్, 8 ఫిబ్రవరి:

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఈరోజు ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 158/8 పరుగులు చేసింది.  దీంతో కివీస్ భారత్ ముందు 159 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

తొలుత టీమిండియా బౌలర్ల ధాటికి కివీస్ ఓపెనర్లు సెఫెర్ట్ 12, మన్రో 12 పరుగులకి ఔట్ అయ్యారు. ఆ  తర్వాత కెప్టెన్ విలియం 20, మిచెల్ 1 వెంటనే పెవిలియన్‌కి చేరారు.

ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రాస్ టేలర్, గ్రాండ్ హోమ్‌లు ధాటిగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇక వీరిద్దరి నిష్క్రమణతో చివరి ఓవర్లలో న్యూజిలాండ్ పరుగులు చేయలేకపోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కివీస్ బ్యాట్స్‌మెన్లలో గ్రాండ్ 50, రాస్ టేలర్ 42 పరుగులు చేశారు. భారత బౌలర్లలో కృనల్ పాండ్యా 3, ఖలీల్ అహ్మద్ 2, హర్ధిక్, భూవీ చెరో వికెట్ తీశారు.

మామాట: మరి మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేస్తారా

Leave a Reply