TRENDING NOW

భీమిలి వైసీపీలో అసమ్మతి రాగం మొదలైంది…

భీమిలి వైసీపీలో అసమ్మతి రాగం మొదలైంది…

విశాఖపట్నం, 20 ఫిబ్రవరి:

గత ఎన్నికల్లో టీడీపీ నుండి అనకాపల్లి ఎంపీగా గెలిచిన అవంతి శ్రీనివాస్…ఈ ఎన్నికలో భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్న విషయం తెలిసిందే. అయితే టీడీపీలో టికెట్ దొరకదని భావించిన అవంతి..తాజాగా వైసీపీలో చేరారు.

ఇక పార్టీలో చేరిన కొద్ది రోజులకే అవంతిని భీమిలి నియోజకవర్గం సమన్వయకర్తగా నియమిస్తూ జగన్ ఈరోజు ప్రకటన చేశారు. దీంతో అవంతిని భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ గా నియమించడంపై అసంతృప్తి జ్వాల చెలరేగింది. ఇప్పటి వరకు భీమిలి వైసీపీ సమన్వయకర్తగా పనిచేసిన విజయనిర్మల వర్గీయలు అవంతి నియామకంపై రగిలిపోతున్నారు. నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేసేందుకు విజయనిర్మల ఎంతో  కృషి చేశారని ఎన్నికలకు మూడు నెలల ముందు అవంతికి బాధ్యతలు అప్పగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

treefurn AD
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
Life Homepathy

మంత్రి గంటా శ్రీనివాసరావును ధీటుగా ఎదుర్కొంటూ ఆమె నియోజకవర్గంలో వైసీపీని ఎంతో బలోపేతం చేశారని చెప్తున్నారు. మరోవైపు అవంతిను భీమిలి నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించడంపై ఆయన వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు. మరి అధినేత జగన్ ఈ అసమ్మతి రాగాన్ని ఎలా తగ్గిస్తారో చూడాలి.

మామాట: ఎన్నికల వేళ ఈ అసమ్మతి రాగాలు మామూలే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: