ప్రభాస్ కథ వరుణ్ దగ్గరకు..చిరంజీవి సినిమాకు టైటిల్ దొరికినట్లేనా…!

director-surendher-reddy-s-next-varun-tej-and-not-prabhas
Share Icons:

హైదరాబాద్: సాహో లాంటి బాలీవుడ్ సినిమా తర్వాత ప్రభాస్ జాన్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా బహుభాషా చిత్రంగా నిర్మిస్తూ ఉండటం వలన, పూర్తయ్యేసరికి చాలా సమయం పడుతుంది. దీని వల్ల ప్రభాస్ కు చెప్పాలనుకున్న కథని దర్శకుడు సురేందర్ రెడ్డి వరుణ్ తేజ్ కు చెప్పినట్లు సమాచారం. కథ నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కిరణ్ కొర్రపాటితో వరుణ్ తేజ్ తన తాజా చిత్రాన్ని చేయవలసి వుంది. కానీ సురేందర్ రెడ్డి ప్రాజెక్టు తరువాతనే కిరణ్ కొర్రపాటితో సెట్స్ పైకి వెళ్లాలనే నిర్ణయానికి వరుణ్ తేజ్ వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు.

చిరు సినిమా

సైరా లాంటి చరిత్రాత్మక సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నట్టుగా సమాచారం. ఈ రెండు పాత్రలను దృష్టిలోపెట్టుకుని ఈ సినిమాకి ‘గోవిందాచార్య’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మరో టైటిల్ తెరపైకి వచ్చింది. ఈ సినిమా దేవాలయ భూముల ఆక్రమణలు .. ఆక్రమణ దారులపై కథానాయకుడి తిరుగుబాటు నేపథ్యంలో సాగుతుందట. అందువలన ‘గోవిందా హరి గోవింద’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.

కార్తికేయ ’90 ML’

కార్తికేయ కథానాయకుడిగా ’90 ML’ చిత్రం రూపొందింది. అశోక్ గుమ్మకొండ నిర్మించిన ఈ సినిమాకి, శేఖర్ రెడ్డి దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమా ద్వారా ‘నేహా సోలంకి’  కథానాయికగా పరిచయమవుతోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, ఒక పోస్టర్ ను వదిలారు.

ఈ పోస్టర్ లోని కార్తికేయ యాక్షన్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, “ముందుగా వేసుకున్న షెడ్యూల్స్ ప్రకారం ఈ సినిమా షూటింగును పూర్తి చేశాము. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హీరో హీరోయిన్ల కాంబినేషన్లో వచ్చే 3 రొమాంటిక్ సాంగ్స్ ను ‘అజర్ బైజాన్’లో చిత్రీకరించాము” అని చెప్పుకొచ్చారు.

 

Leave a Reply