‘అహం బ్రహ్మాస్మీ’ పై మోజు పడిన బాలయ్య…!!

Share Icons:

హైదరాబాద్, 7 మార్చి:

వెరైటీ కథాంశాలతో తనదైన శైలిలో సినిమాలు తెరకెక్కిస్తారు క్రిష్. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత… ప్రస్థుతం మణికర్ణిక చిత్రం చేస్తున్నారాయన.

ఇక క్రిష్ దర్శకత్వంలో  తదుపరి ‘అహం బ్రహ్మాస్మి’అనే సినిమా రూపొందనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో కథానాయకుడు ఎవరా అనే ఆసక్తి అందరిలోనూ రేకెత్తుతోంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

అహం బ్ర‌హ్మ‌స్మి .. అనే టైటిల్ ముందుగా వ‌రుణ్ తేజ్ – సంక‌ల్ప్ రెడ్డి కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న చిత్రానికి పెడ‌తార‌ని ముందుగా వార్త‌లు వ‌చ్చాయి. కాని క్రిష్ ముందుగానే ఈ టైటిల్‌ను ఫిలిం చాంబ‌ర్‌లో రిజిస్ట‌ర్ చేయించుకోవ‌డంతో త‌న త‌దుప‌రి చిత్రానికి ఇదే టైటిల్ పెడ‌తాడ‌ని అంటున్నారు.

క్రిష్ ప్ర‌స్తుతం కంగ‌నా ర‌నౌత్ ప్ర‌ధాన పాత్ర‌లో మ‌ణికర్ణిక అనే సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తైన త‌ర్వాత అహం బ్ర‌హ‌స్మి ప్రాజెక్ట్‌ని మొద‌లు పెట్ట‌నున్నాడు. అయితే ఇందులో క‌థానాయ‌కుడిగా బాల‌య్య‌ని ఎంపిక చేసుకున్నాడ‌ట‌.

గత సంవత్సరం క్రిష్ తో ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ చేసి విపరీతమైన పేరు తెచ్చుకున్న బాలకృష్ణ ఈమధ్య క్రిష్ తనకు చెప్పిన ‘అహం బ్రహ్మాస్మీ’ కథకు విపరీతంగా మోజు పడినట్లు వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో తీయబోతున్న ఈమూవీని రాజీవ్ రెడ్డి సాయి బాబా జాగర్ల మూడిలు సంయుక్తంగా నిర్మిస్తారని వార్తలు వస్తున్నాయి..

బాల‌య్య ప్ర‌స్తుతం త‌న తండ్రి బ‌యోపిక్‌కి సంబంధించిన ప‌నుల‌తో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ పూర్త‌య్యాకే అహం బ్ర‌హ్మ‌స్మి ని మొదలుపెట్టి వచ్చే సంవత్సరం ఎన్నికలు తరువాత విడుదల చేయాలని బాలయ్య ప్లాన్ అని అంటున్నారు.

మామాట: ఆరు పదుల వయసులోను బాలకృష్ణ స్పీడ్ తగ్గట్లేదుగా…

English Summary: Krish had earlier directed Balakrishna in the historical epic film, “Gautamiputra Satakarni”, which was the landmark 100th film in the senior hero’s career. “Aham Brahmasmi” will be their second film together, and like the first, this new project will also be mounted on a huge scale and made with high technical standards. Saibabu Jagarlamudi and Rajeev Reddy will jointly produce the movie on massive budget

Leave a Reply