విడాకులకు దరఖాస్తు… క్రిష్ వ్యక్తిగత జీవితానికి ఏమైంది?  

director krish and ramya to take divorce
Share Icons:

హైదరాబాద్:

సమాజనికి ఓ మంచి సందేశం ఇస్తూ గమ్యం, వేదం, కంచె, గౌతమీ పుత్రశాతకర్ణి లాంటి వైవిధ్య భరితమైన చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు క్రిష్ తక్కువ సినిమాలతోనే మంచి పేరు సంపాదించుకున్నారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీ బాయ్ జీవితకథ ఆధారంగా బాలీవుడ్‌లో ‘మణికర్ణిక’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అది పూర్తవ్వగానే ‘ఎన్టీఆర్’ జీవిత కథని తెరకెక్కించబోతున్నారు. అందరి జీవిత కథలను తెరకెక్కిస్తున్న ఆయన జీవితం మాత్రం గందరగోళంలో పడింది. క్రిష్ దంపతులు విడకులకు దరఖాస్తు చేసి ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్‌కు గురి చేశారు.

ఈ విషయం గురించి తెలిసిన తెలుగు సినీ వర్గాలు విస్మయం చెందుతున్నాయి. అసలు క్రిష్ వ్యక్తిగత జీవితనికి ఏమయ్యింది? అంతా కలిపి పెళ్లయ్యి రెండేళ్ళు కూడా నిండకుండానే విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటి? అనే చర్చించుకుంటున్నారు.

రెండేళ్ళు కూడా నిండకుండానే…

క్రిష్ అలియాస్ జాగర్లమూడి రాధాకృష్ణ, డాక్టర్ రమ్యసాయి వెలగ అనే యువతిని పెళ్లాడి ఇంకా రెండేళ్ళు కూడా నిండలేదు. 2016 ఆగస్ట్ 7న గౌతమీ పుత్ర శాతకర్ణి షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి మరీ రమ్యను వివాహం చేసుకున్నాడు. అది కూడా తల్లితండ్రులు చూసిన సంబంధాన్నే అంగీకరించి పెళ్లి చేసుకున్నాడు. మరి ఏమైందో తెలీదు కానీ, ఇరువురూ విడాకులు తీసుకోవడాన్ని మాత్రం క్రిష్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇరువురి అంగీకారంతోనే విడాకులు…

తాజాగా క్రిష్, రమ్య ఇద్దరూ విడకులకు దరఖాస్తు చేసుకున్నారనే వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. పైగా ఇద్దరూ ఒకే అభిప్రాయంతో విడాకులు తీసుకోవడానికి పరస్పర అంగీకారం తెలిపినట్టు సమాచారం.

సినిమాలే కారణమా…??

చాలామంది చర్చింకుంటున్న విషయం ఏమిటంటే క్రిష్, రమ్య ఇద్దరూ తమ దాంపత్య జీవితాన్ని సంతోషంగా గడపలేకపోతున్నారట. ఒక పక్క క్రిష్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నాడు. రమ్య సైతం వృత్తి రీత్యా డాక్టర్ కావడంతో బిజీగానే ఉంటుందట. వీరివురి వృత్తుల కారణంగా ఇద్దరి మధ్య సఖ్యత లోపించిందని ఫిల్మ్ నగర్ జనాలు చర్చించుకుంటున్నారు. క్రిష్ షూటింగ్ నుండి ఏ సమయానికి ఇంటికి వస్తాడో తెలీదు. రమ్య ఏ సమయంలో హాస్పిటల్‌కి పరుగెత్తాల్సి వస్తుందో తెలీదు. ఇలా ఒకరికి ఒకరు పొంతన లేకుండా బిజీ బిజీ జీవితాలు గడపడం వల్లే ఇద్దరి మధ్యా దూరం పెరిగిందని సమాచారం. ‘ఎంత కాలం ఇలా సంబంధం లేకుండా బ్రతుకుతాం’ అనే ఆలోచనతోనే పరస్పరం చర్చించుకుని విడాకులు తీసుకోవాలనుకున్నారని సమాచారం..

పెళ్లి వైభవం ఇంకా కళ్ల ముందే కదలాడుతుంది..

హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్‌లో 2016 ఆగస్ట్ 7న జరిగిన క్రిష్, రమ్యల వివాహానికి ఇండస్ట్రీ మొత్త హాజరయ్యింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో సినీ ప్రముఖులంతా తళుక్కున మెరిశారు. ”దేవతలే బంధువుల్లా వస్తారంట… మీరొస్తే ఒక దేవతొచ్చినట్టే… మీ కోసం మీ ఆశీస్సుల కోసం వేదమంత్రాలు కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తుంటాయని మర్చిపోకండి. మీరు సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి నన్నూ మా ఆవిడ్నీ ఆశీర్వదించాలని మా అమ్మ అంజనాదేవి, నాన్నగారు సాయిబాబుగారు కూడా మీకు మరీ మరీ చెప్పమన్నారు”… నా సినీ జీవితం ‘గమ్యం’తో మొదలైతే, నా అసలు జీవితం ఇప్పుడు ‘రమ్యం’గా మొదలవుతోంది… మీ ఆశీస్సులు కావాలి” అంటూ క్రిష్ తయారు చేయించిన వివాహ ఆహ్వాన పత్రిక ఎవరైనా మరిచిపోగలరా.. ఆ మధుర క్షణాలు గుర్తుచేసుకున్న ఇండస్ట్రీ ప్రముఖులంతా ఇలా జరిగిందని తెలిసి చింతిస్తున్నారు..

మామాట: వృత్తులు వేరైనా కలిసి నడిచే దంపతులు ఎంతమంది లేరు…?

 

Leave a Reply