తక్కువ ధరకే ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ

Share Icons:

ఢిల్లీ, 6 జూన్:

ప్రముఖ టీవీల తయారీదారు దైవా.. ఓ నూతన ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. డీ32ఎస్‌బీఏఆర్ మోడల్ నంబర్ పేరిట ఈ టీవీ మార్కెట్‌లో విడుదలైంది. ఈ టీవీలో 32 ఇంచుల హెచ్‌డీ డిస్‌ప్లేను ఏర్పాటు చేయగా ఈ డిస్‌ప్లే 1366 x 768 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది.

ఇందులో 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 3 హెచ్‌డీఎంఐ పోర్టులు, 2 యూఎస్‌బీ పోర్టులు, 1 ఆప్టికల్ అవుట్‌పుట్ పోర్టు, వైఫై, ల్యాన్ ఫీచర్లను అందిస్తున్నారు. 

కాగా దైవా డీ32ఎస్‌బీఏఆర్ టీవీని రూ.12,990 ధరకు అందిస్తున్నారు. దీన్ని దైవా అఫిషియల్ వెబ్‌సైట్‌తోపాటు పలు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ టీవీపై 2 సంవత్సరాల వారంటీని అందిస్తున్నారు. ఇందులో క్రికెట్ పిక్చర్ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల వీక్షకులకు క్రికెట్ మ్యాచ్‌ల వ్యూయింగ్ ఎక్స్‌పీరియెన్స్ అద్భుతంగా ఉంటుంది.

Leave a Reply