టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్.. ఉద్రిక్తత

Share Icons:
  • చింతలపూడిలోని నివాసం వద్ద భారీగా పోలీసుల  మోహరింపు
  • తెల్లవారుజామున అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పోలీసులు
  • ముందస్తు సమాచారం లేకుండా అరెస్ట్ ఎలా చేస్తారంటున్న టీడీపీ నేతలు
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఈ తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అయితే, ఆయనను ఎందుకు అరెస్ట్ చేశారు? ఎక్కడికి తీసుకెళ్లారు? అనే విషయాలు తెలియరాలేదు. అయితే, రాజధాని భూముల వ్యవహారంలోనే ఆయనను అరెస్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. నరేంద్ర అరెస్ట్‌పై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఎలా అరెస్ట్ చేశారని ప్రశ్నిస్తున్నారు. కాగా, నరేంద్ర అరెస్ట్‌తో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.
-కె. రాంనారాయణ, జర్నలిస్ట్.

Leave a Reply