షమి అంత చెడ్డవాడు కాదు: ధోని

షమి అంత చెడ్డవాడు కాదు: ధోని
Views:
18

ముంబయి, 13 మార్చి:

భారత్ పేస్ బౌలర్ మహ్మద్ షమి భార్య హసీన్ జహా జేస్తున్న ఆరోపణలతో సతమతమవుతున్న వేళ అతడికి టీమిండియా సభ్యుల నుండి మద్దతు లభిస్తోంది.

జట్టులో పాస్ట్ బౌలర్‌గా షమి ఎదుగుదలకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తనకు మద్దతుగానిలిచాడు.

షమికి అతడి భార్యకు జరుగుతున్న గొడవ వారి వ్యక్తిగత వ్యవహారం అంటూనే, ఆమె అంటున్నట్లు షమి అంత చెడ్డవాడు కాదంటూ ధోని అభిప్రాయపడ్డారు.

తనకు తెలిసినంత వరకు షమి మంచి మనసున్న వ్యక్తి అని, అతడు భార్యను, ఈ దేశాన్ని మోసం చేయడని చెప్పాడు.  అయితే ఇదంతా అతడి వ్యక్తిగత వ్యవహారమని, ఇంతకు మించి మాట్లాడలేమని ధోని తెలిపాడు.

ఇప్పటికే ఈ వ్యవహారంలో షమికి మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, చేతన్ చౌహాన్‌లు మద్దతిచ్చిన విషయం తెలిసిందే. షమి క్రికెట్ ను ప్రేమిస్తూ, కష్టపడి ఆడే వ్యక్తిగానే తనకు తెలుసని, అతడి భార్య చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని తాను భావిస్తున్నట్లు కపిల్ తెలిపారు.

ఇది ఇలా ఉండగా షమి, అతడి భార్య హసీన్‌ మధ్య సాగుతున్న వివాదం త్వరలోనే పరిష్కారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు షమి కుటుంబ సభ్యులు హసీన్‌ లాయర్‌ను కోల్‌కతాలో కలవనున్నారు. కోర్టు బయట సమస్యను ముగించేందుకు గల అవకాశాలపై ఆయనతో చర్చించనున్నారు.

మామాట: ఈ వివాదానికి ఎప్పుడు తెరపడుతుందో..?

English summary:

Former Indian skipper Mahendra Singh Dhoni had come forward in support of his team-mate Mohammed Shami over the on-going controversy.

“As far as I know, Shami is a great human being. He cannot cheat his wife and country. This is Shami’s personal matter and we should not make any comment on it,” said Dhoni.

(Visited 13 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: